దొంగను పట్టుకొని స్టేషన్‌కు తీసుకొచ్చిన హోంగార్డు.. పోలీసులు చేసిన పనికి రోడ్డుపై నిరసన
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో అనూహ్య ఘటన వెలుగుచూసింది. హోం గార్టు కష్టపడి ఓ దొంగను పట్టుకొచ్చి అప్పగిస్తే పోలీసులు అతడి వద్ద డబ్బులు తీసుకోని వదిలేయంతో.. ఆ హోంగార్టు నిరసన చేయడం చర్చనీయాంశమైంది.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో అనూహ్య ఘటన వెలుగుచూసింది. హోం గార్టు కష్టపడి ఓ దొంగను పట్టుకొచ్చి అప్పగిస్తే పోలీసులు అతడి వద్ద డబ్బులు తీసుకోని వదిలేయంతో.. ఆ హోంగార్టు నిరసన చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే ఆ హోంగార్డు ఓ దొంగను పట్టుకున్నాడు. అతడ్ని భోగాపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించాడు. అయితే మరుసటి రోజున హోంగార్టు మళ్లీ ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ దొంగ గురించి అడిగితే అక్కడున్న పోలీసులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. చివరికి ఆ హోంగార్టు అక్కడే రోడ్డుపై నిరసన చేశాడు.
అంతేకాదు వాహనాల రాకపోకలను ఆపేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ఇనుప చువ్వలకు తాళ్లు కట్టేశాడు. దీంతో పలు వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోయి. అయితే ఓ పోలీస్ అధికారి ఆ హోంగార్టుని మందలించి తాళ్లు విప్పాడు. అయినా కూడా ఆ హోంగార్డు రోడ్డుపైనే పడుకుని నిరసనలు తెలిపాడు. దీంతో రహదారిపై మళ్లీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనపై భోగ్‌పూర్ స్టేషన్ ఇంఛార్జి సుఖ్‌జీత్ సింగ్ స్పందిచారు. గొడవ పడుతున్న వ్యక్తిని హోంగార్డు స్టేషన్‌కు తీసుకురాగా.. అతడు బెయిల్‌పై బయటికి వెళ్లాడని చెప్పారు. అయితే ఆ హోంగార్టు మాత్రం డబ్బులు తీసుకోని అతడ్ని వదిలిపెట్టారంటూ వాపోయాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..