Telangana: గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా చదువుల తల్లులకు ఆర్ధిక సాయం.. విద్యార్ధినిలకు చెక్కుల అందజేత

మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ ఎంజీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న తిరుమలగిరి మండలం జలాల్ పురం గ్రామానికి చెందిన కొమ్ము కిష్టయ్య కుమార్తె సుమతి కాలేజీ పీజుల కోసం చదువు పూర్తయ్యే వరకు రూ. లక్ష ఆర్దిక సాయం అందజేయనునట్లు తెలిపారు.

Telangana: గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా చదువుల తల్లులకు ఆర్ధిక సాయం.. విద్యార్ధినిలకు చెక్కుల అందజేత
Mayday Rajeev Sagar
Follow us
Sridhar Prasad

| Edited By: Surya Kala

Updated on: Jul 23, 2023 | 4:27 PM

పేదరికంతో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఇద్దరు విద్యార్ధినిలకు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆర్ధిక సాయం చేసి అండగా నిలిచారు. రాష్ట్ర మంత్రి వర్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకోని గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా ఈ సాయం చేసినట్లు వివరించారు. నేడు వారి కార్యాలయంలో ఇద్దరు విద్యార్ధినిలకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ ఎంజీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న తిరుమలగిరి మండలం జలాల్ పురం గ్రామానికి చెందిన కొమ్ము కిష్టయ్య కుమార్తె సుమతి కాలేజీ పీజుల కోసం చదువు పూర్తయ్యే వరకు రూ. లక్ష ఆర్దిక సాయం అందజేయనునట్లు తెలిపారు. అలాగే మీర్ పేట్ టీకెఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న వెలుగుపల్లి గ్రామానికి చెందిన మల్లెపాక రాములు కుమార్తె శ్వేత కాలేజీ ఫీజుల కోసం ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా అందజేయనున్నట్లు తెలిపారు. పేదరికంలో ఏ అమ్మాయి కూడా చదువుకు దూరం కావద్దనే తనతో అయిన మేర విద్యార్ధినుల చదువుకు సాయం చేస్తున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..