AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏ పూజ చేస్తే ఇలాంటి భర్త దొరుకుతాడో.. అందరికీ కొంచెం టిప్ ఇవ్వమ్మా..

హెడ్‌ కానిస్టేబుల్‌గా ట్రైనింగ్‌ ముగించుకుని ఇంటికి వచ్చిన భార్యకు ఘనంగా స్వాగతం పలికాడు ఓ భర్త. ఏకంగా డోలు సన్నాయి మేళం ఏర్పాటు చేసి, బాణాసంచా కాల్చుతూ తన పోలీస్‌ భార్యకు ఆహ్వానం పలికాడు. ఆమె రాకను పండగలా సెలబ్రేట్‌ చేయడంతో స్థానికులంతా ఆశ్చర్యంగా చూశారు.

Hyderabad: ఏ పూజ చేస్తే ఇలాంటి భర్త దొరుకుతాడో.. అందరికీ కొంచెం టిప్ ఇవ్వమ్మా..
Constable Deena
Surya Kala
|

Updated on: Jul 22, 2023 | 4:15 PM

Share

ప్రతి భర్త ప్రగతి వెనుక భార్య ఉంటుందని అంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు భార్య, భర్తలు కూడా ఉద్యోగాలు, వ్యాపారం వంటివి చేస్తున్నారు. తమ భార్య ప్రగతికి భర్త అండగా నిలబడి.. ఆమె విజయం సాధిస్తే తాను సంతోషపడుతూ సెలబ్రేట్ చేసి తన ఆనందాన్ని ప్రకటిస్తున్నారు కూడా.. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి భాగ్యనగరంలో చోటు చేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌గా ట్రైనింగ్‌ ముగించుకుని ఇంటికి వచ్చిన భార్యకు ఘనంగా స్వాగతం పలికాడు ఓ భర్త. ఏకంగా డోలు సన్నాయి మేళం ఏర్పాటు చేసి, బాణాసంచా కాల్చుతూ తన పోలీస్‌ భార్యకు ఆహ్వానం పలికాడు. ఆమె రాకను పండగలా సెలబ్రేట్‌ చేయడంతో స్థానికులంతా ఆశ్చర్యంగా చూశారు. ఈ ఘటన హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో చోటు చేసుకుంది. అంతేకాదు ఆ వీడియోను సదరు భర్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటజన్లు రకరకరాలుగా స్పందించారు.

భార్యకు వెల్కమ్ చెబుతున్న భర్త 

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు దీనా. ఆమెకు ఇటీవల హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ రావడంతో ఆమె ట్రైనింగ్‌ కోసం వెళ్లారు. ట్రైనింగ్‌ విజయవంతంగా పూర్తిచేసుకొని తిరిగి వచ్చిన భార్యకు ఆమె భర్త ఘనంగా స్వాగతం పలికాడు. ఊహించని ఆ పరిణామానికి ఆమె సంతోషంతో పొంగిపోయింది. అంతేకాదు బంధుమిత్రులు, స్థానికుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..