AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వంద స్తంభాల గుడిలో వెయ్యి సమస్యలు.. రక్షించాలంటూ స్థానికుల వేడుకోలు..

చారిత్రక ఆననాళ్లకు.. శిల్ప కళా సంపదకు..వంద స్తంభాల ఆలయం సజీవ సాక్ష్యంలా నిలుస్తోంది. రాజుల పాలనలో వెలిగినా ... నవాబులు సర్కారులో మజీదుగా గుర్తింపు పొందినా ఈ దేవుల మజీద్ స్దంభాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. స్తంభాల పై ఉన్న విష్ణు మూర్తి దశావతారాలు ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటాయి.

Telangana: వంద స్తంభాల గుడిలో వెయ్యి సమస్యలు.. రక్షించాలంటూ స్థానికుల వేడుకోలు..
100 Pillars Temple
Prabhakar M
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 22, 2023 | 4:34 PM

Share

అదో పురాతన ఆలయం.. చారిత్రక శిల్ప సంపద ఆ ఆలయ సొంతం.. వరంగల్ వేయి స్తంభాల ఆలయం తరహాలో వెలసిన వంద స్తంభాల దేవాలయం. రాష్ట్ర కూట చక్రవర్తి..మూడో ఇంద్ర వల్లభుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయాన్ని ఇంద్ర నారాయణ అని పిలుస్తారు. వరంగల్ వేయి స్తంభాల ఆలయం పోలికలతో.. ఆ ఆలయం కంటే ముందే బోధన్ లో వంద స్తంభాల ఆలయం ఇంద్ర వల్లభుడు పరిపాలించిన కీ.శ. 915 నుంచి 927 మధ్య కాలంలో నిర్మించినట్లు శాసనాలు ఉన్నాయి. అద్బుతమైన శిల్ప సౌందర్యంతో ఆకట్టుకునే కట్టడం నిర్మించారు. విష్ణు మూర్తి విగ్రహాంతో ఒకప్పుడు.. విరాజిల్లిన ఈ ఆలయం.. ఇప్పుడు శిథిలదశకు చేరుకుంది.

హిందువులు వంద స్తంభాల ఆలయంగా… ముస్లింలకు దేవుల మసీదు

ఈ చారిత్ర‌క ఆల‌యానికి ఓ ప్రత్యేకత ఉంది…హిందువులు వంద స్తంభాల ఆలయంగా… ముస్లింలకు దేవుల మసీదు గా కోల‌వ‌డం ఇక్క‌డ ప్ర‌త్యేక‌త.. కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్రకు వెళుతూ.. మహమ్మద్ బీన్ తుగ్లక్.. ఈ దేవాలయంపై దాడి చేసి మజీదుగా మార్చినట్లు చారిత్రకారులు పరిశోధకులు చెబుతున్నారు. ఫలితంగానే హిందువులు వంద స్తంభాల ఇంద్ర నారాయణ ఆలయంగా…. పిలిస్తే.. ముస్లింలు దేవుల మసీదుగా పిలుస్తున్నారు… ఆ కాలంలో రెండు ర‌కాల ప్రార్థ‌న‌లు ఇక్క‌డ జ‌రిగేవ‌ని స్థానికులు చెబుతారు… అప్పుడు యుద్దాలకు కేంద్రంగా నిలిచిన ఇప్ప‌టికీ మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక నిలుస్తుంద‌ని చెబుతారు స్థానికులు… చారిత్రక ఆననాళ్లకు.. శిల్ప కళా సంపదకు..వంద స్తంభాల ఆలయం సజీవ సాక్ష్యంలా నిలుస్తోంది. రాజుల పాలనలో వెలిగినా … నవాబులు సర్కారులో మజీదుగా గుర్తింపు పొందినా ఈ దేవుల మజీద్ స్దంభాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. స్తంభాల పై ఉన్న విష్ణు మూర్తి దశావతారాలు ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటాయి.

వంద స్థంభాల ఆల‌యంకు ఇప్పుడు వెయ్యి స‌మ‌స్య‌లు

అతి పురాతనమైన.. వంద స్తంభాల ఆలయం ప్రస్తుతం శిథిల దశకు చేరుకుంది. స్తంభాలు కూలేందుకు సిద్దం కాగా.. విష్ణుమూర్తి విగ్రహాం కందకుర్తికి తరలించారు. దేవుని విగ్రహాం లేని ఆలయంగా బోసిపోతుంది. అద్బుతమైన శిల్ప సంపద చారిత్రక వైభవం ఉన్న.. దేవుల మజీద్ అభివృద్ది ఇటు రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు అటు పాలకులకు పట్టింపులేకుండా మారింది. ఫలితంగా దేవుల మజీదు ప్రాంతం పోకిరీలకు అడ్డాగా.. అసాంఘీక కార్యక్రమాలకు నెలవుగా మారింది. ఒకప్పుడు ధూపధీప నైవేధ్యాలు… ప్రార్ధనలకు నిలయంగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు వెళవెళబోతోంది. వరంగల్ వేయి స్తంభాల ఆలయం తరహాలో అభివృద్ది చేసి.. చారిత్రక సంపద చరిత్రను భావితరాలకు అందించాలని చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మ‌ళ్లి వన్నేతేండి- ఆల‌యాన్ని ర‌క్షించ‌డండి- స్థానికులు

ఇప్పుడు శిథిలావ‌స్థ‌కు చేరుకున్న ఈ ఆల‌యాన్ని ర‌క్షించాల‌ని.. కోరుతున్నారు స్థానికులు… బోధన్ పట్టణానికి తలమానికంలా నిలిచే ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు. గతంలో ఈ ఆలయం అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేసినా.. అవి అమలుకు నోచుకోలేదని బోధన్ పట్టణ వాసులు ఆవేదన చెందుతున్నారు. బోధన్ పట్టణానికి వన్నె తెచ్చే .. ఈ ఆలయానికి పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశలో సర్కారు చొరవ తీసుకుంటుందని ఆశిద్దాం….

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..