Viral: ఈ పురుగులు ఏంటో మీకు తెల్సా.. ఇవి కానీ పొలాల్లో కనిపిస్తే..

ఆరుద్ర పురగులు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. దున్నిన నేలల్లోని చీడపురుగుల లార్వాలను తిని.. పంట వేయకముందే రైతుకు మేలు చేకూరుస్తాయి. ఇవి పొలంలో కనిపిస్తే.. రైతు ఎంతో సంబరపడిపోతాడు.

Viral: ఈ పురుగులు ఏంటో మీకు తెల్సా.. ఇవి కానీ పొలాల్లో కనిపిస్తే..
Insects
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 22, 2023 | 5:06 PM

ఈ భూమి ఎన్నో కోట్ల జీవులకు ఆవాసం. మనుషులతో పాటు పశుపక్షాదులు, కీటకాలు, రకరకాల పురుగులు, బ్యాక్టీరియా ఈ నేలపై ఉంటాయి. అయితే కొన్ని రకాల పురుగులు  కొన్ని ప్రత్యేక సీజన్లలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియని ఆరుద్ర పురుగులను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. రైతులు దుక్కులు దున్నాక.. తొలకరి జల్లులు పడగానే.. ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి.  ఆరుద్ర కార్తిలో ఈ పురుగులు తారసపడుతూ ఉంటాయి. గతంలో ఎక్కువగా కనిపించేవి కానీ.. ఇప్పుడు క్రిమి సంహారక మందుల పిచాకారీ., రసాయన ఎరువుల వినియోగం. పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో వాటి ఉనికి కూడా ప్రశ్నార్థకమైంది. ఎప్పుడూ భూమి లోపల నివాసం ఉండే ఈ పురుగులు.. తొలకరి వానలు పడ్డప్పుడు మాత్రమే బయటకు వచ్చి కనువిందు చేస్తాయి.

ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తే.. రైతుల్లో ఆనందం వెల్లువిరిస్తుంది. ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఏడాదంతా దండిగా వర్షాలు పడతాయని.. కాలవలు చెరువులు, కుంటలు నీటితో నిండుతాయని నమ్మకం. అలాగే పంట దిగుబడి కూడా బాగా ఉంటుందని చెబుతుంటారు. ఎర్రగా, బొద్దుగా.. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా చెబుతుంటారు.  ఇంద్రగోప, చందమామ, లేడీ బర్డ్, కుంకుమ పురుగులు ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. మనం తాకాం అనుకోండి.. ఈ పురుగులు కాసేపు అక్కడే ఆగిపోతాయి. అప్పట్లో పిల్లలు ఈ పురుగులతో ఆడుకునేవారు. ఇప్పుడు వాటి గురించి చెప్పేవారు కూడా కరువయ్యారు. ఆరుద్ర కార్తె ముగిసినప్పటికీ ఈ అందమైన పురుగులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే