Andhra Pradesh: నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. ఒకే రోజు ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..
కానీ ఇక్కడ అలా జరగలేదు.. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేర్వేరు సమయాల్లో వేర్వేరు రోగులు చనిపోయిన విషయాన్ని సూపరింటెండెంట్ తెలిపారు.. సూపరింటెండెంట్ ఆరుగురు రోగులు ఒకేరోజు చనిపోవడానికి నిర్లక్ష్యం కారణం కాదని ఖండించినా దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తోంది.
నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఒకే రోజు ఆరుగురు మృతి చెందడం సంచలనంగా మారింది.. అది కూడా అందరూ MICU లో ఉన్న పేషెంట్స్.. శుక్రవారం నాడు దారుణం జరిగింది.. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. దాదాపు రెండు గంటలపాటు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఆక్సిజన్ అందక ఒకే సమయంలో ఆరుగురు రోగులు చనిపోయారని వార్త బయటకు వచ్చింది.. ఇదంతా వెలుగులోకి రాకుండా ఆస్పత్రి వర్గాలు గోప్యంగా ఉంచారని స్ప్రెడ్ అవుతోంది..
ఒక్కరోజు ఆలస్యంగా విషయం బయటకు రావడంతో మీడియా ఆస్పత్రికి వెళ్ళింది.. ఒకేరోజు ఆరుగురు చనిపోవడం మాములు విషయం కాదు.. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులను అడగగా సూపరింటెండెంట్ సిద్దా నాయక్ వివరణ ఇచ్చారు.. కరెంట్ సరఫరా లేకపోవడంతో మృతి అన్న విషయాన్ని ఖండించారు.. అసలు కరెంటు సరఫరాకు ఆక్సిజన్ కు అసలు సంబంధమే లేదన్నారు.. ఆక్సిజన్ కరెంటు అవసరం లేకుండానే పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతుందని చెప్పారు.. వెంటిలేటర్ పై ఉన్న వారికి మాత్రమే కరెంటు సరఫరా అవసరం ఉంటుందని.. చనిపోయిన ఆరు మంది రోగులు వెంటిలేటర్ పై ఎవరూ లేరన్నారు..
అలాగే కరెంటు లేక.. వెంటిలేటర్ పై ఉన్నవారు చనిపోయి ఉంటే అందరూ ఒకే సమయంలో చనిపోయి ఉంటారు.. కానీ ఇక్కడ అలా జరగలేదు.. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేర్వేరు సమయాల్లో వేర్వేరు రోగులు చనిపోయిన విషయాన్ని సూపరింటెండెంట్ తెలిపారు.. సూపరింటెండెంట్ ఆరుగురు రోగులు ఒకేరోజు చనిపోవడానికి నిర్లక్ష్యం కారణం కాదని ఖండించినా దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..