మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య అరెస్టు.. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ కోసం పని చేస్తున్నారన్న ఎన్ఐఏ..

Maoist Leader RK Wife Sirisha: శిరీష, ప్రభాకర్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వెల్లడించారు. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ కోసం వీరు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని..

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య అరెస్టు.. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ కోసం పని చేస్తున్నారన్న ఎన్ఐఏ..
Maoist Leader Rk Wife Sirisha
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 22, 2023 | 5:25 PM

ప్రకాశం, జూలై 22: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (రామకృష్ణ అలియాస్‌ ఆర్కే) భార్య శిరీష అలియాస్‌ పద్మనిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించింది ఎన్ఐఏ అధికారులు. ఆర్కే డైరీ ఆధారంగా శిరీష, దొడ్డు ప్రభాకర్‌పై కేసులు నమోదు సినట్లుగా తెలిపారు. శిరీష, ప్రభాకర్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వెల్లడించారు. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ కోసం వీరు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్‌ఐఏ అధికారుల బృందం శిరీషను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఒంగోలు దిశ ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమాల సమక్షంలో ఆమెను అక్కడ నుంచి స్పెషల్ వాహనం తరలించారు.

ఐఎన్ఏ అధికారులు దాడులు జరపడం, సోదాలు చేయడం ఇదే తొలి సారి కాదు.. గత ఏడాది కూడా మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఎన్‌ఐఏ బృందం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనారోగ్యంతో 2021లో ఆర్కే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కొడుకు మున్నా కూడా తండ్రి బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం