TTD: అరుదైన రికార్డుకు చేరువలో టీటీడీ.. త్వరలోనే సరికొత్త మైలురాయికి విరాళాలు

శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. సింపుల్‌గా శ్రీవాణి ట్రస్ట్. టీటీడీ అమలు చేస్తున్న చాలా ట్రస్టుల్లో శ్రీవాణి ట్రస్టు ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. అనేక విమర్శలు వివాదాలతో తెరమీదకి వచ్చింది. 2018లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు శ్రీవాణి పేరుతో ట్రస్ట్‌ను ప్రారంభించిన టీటీడీ భక్తులకు ప్రివిలైజ్‌గా వీఐపీ..

TTD: అరుదైన రికార్డుకు చేరువలో టీటీడీ.. త్వరలోనే సరికొత్త మైలురాయికి విరాళాలు
TTD
Follow us
Raju M P R

| Edited By: Narender Vaitla

Updated on: Jul 22, 2023 | 6:12 PM

శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. సింపుల్‌గా శ్రీవాణి ట్రస్ట్. టీటీడీ అమలు చేస్తున్న చాలా ట్రస్టుల్లో శ్రీవాణి ట్రస్టు ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. అనేక విమర్శలు వివాదాలతో తెరమీదకి వచ్చింది. 2018లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు శ్రీవాణి పేరుతో ట్రస్ట్‌ను ప్రారంభించిన టీటీడీ భక్తులకు ప్రివిలైజ్‌గా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది. రూ.10 వేల విరాళంగా ఇస్తే రూ. 500ల విఐపి దర్శనం టికెట్‌తో శ్రీవారి దర్శనం అవకాశం కల్పిస్తోంది. ఇలా ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథ మార్ధం నాటికి రూ. 1000 కోట్ల విరాళాలు స్వీకరించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.

ట్రస్టు ప్రారంభమైనప్పటి నుంచి టీటీడీ రాష్ట్ర దేవాదాయ శాఖ, సమరసత సేవా ఫౌండేషన్ తో కలిపి విరాళాలను శ్రీవాణి ట్రస్ట్ కు నిధులను సేకరిస్తుంది. ఇలా సేకరించిన నిధులను బ్యాంకుల్లో డిపాజిట్‌ల రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్న టీటీడీ పలు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లను చేసింది. వడ్డీ రూపంలో వచ్చే మొత్తాన్ని ట్రస్ట్ లక్ష్యాల కోసం ఖర్చు చేస్తోంది. మత మార్పిడులు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణంతో పాటు జీర్ణోదరణకు నోచుకొని ఆలయాల పునర్నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీ మత్స్యకార గ్రామాలు కాలనీల్లో భజన మందిరాలు నిర్మిస్తోంది. 2018 ఆగస్టు 28 నాటి టిటిడి బోర్డు తీర్మానంలో ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణకు నోచుకోని ఆలయాల పున్నర్ నిర్మాణం, భజన మందిరాల నిర్మాణం కోసం ఈ ట్రస్టు ను ఏర్పాటు చేయగా జూన్ 2023 లో టీటీడీ సాయంతో నిర్మించిన ఆలయల్లో పనిచేసే అర్చకుల కోసం రూ. 5 వేలు ట్రస్టు నిధుల నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది.

ఇక ఈ మధ్యనే శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేత పత్ర విడుదల చేసిన టీటీడీ పక్కా లెక్కలు ప్రకటించింది. జూన్ 30 నాటికి రూ.882 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళంగా వచ్చాయని 9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ప్రకటించింది. రూ.603 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయగా రూ. 38 కోట్ల వడ్డీ వచ్చిందని, రూ. 120 కోట్లు ఆలయాల నిర్మాణం కోసం ఖర్చు చేశామని ప్రకటించింది. 2273 ఆలయాలు గోశాలలు భజన మందిరాల నిర్మాణానికి రూ.227 కోట్లు కేటాయించామని, ఏపీ తెలంగాణ తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల్లో 127 పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ. 139 కోట్ల కేటాయింపు జరిగిందని టిటిడి ప్రకటన చేసింది. అయితే ఇప్పటికే సెప్టెంబర్ నెల వరకు శ్రీవాణి ట్రస్ట్ కింద టికెట్ల కేటాయింపు జారీ చేసిన టీటీడీ రూ. వెయ్యి కోట్ల ఆదాయాన్ని రీచ్ అయ్యింది.

ఇప్పటికే శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తుల నుంచి టిటిడి ఆదాయాన్ని పొందింది. ఈ మేరకు ఈ ఆర్థిక అర్ధ సంవత్సరానికి శ్రీవాణి ద్వారా వెంకన్న ఆదాయం రూ. 1000 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంది. అయితే అధికారికంగా 1000కోట్ల ఆదాయాన్ని టిటిడి ప్రకటించాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..