Telangana: వీధి కుక్క విశ్వాసం.. ఇక పలకరించందంటూ విషాదంలో పోలీసులు..!
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో సంచరించే వీది కుక్క ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది.అపస్మారక స్థితిలో ఉన్న కుక్క ను చూసిన సిఐ కరుణాకర వెంటనే పశు వైద్యులను స్టేషన్ వద్దకు పిలిపించి కుక్కకు దగ్గరుండి వైద్యం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో సంచరించే వీది కుక్క ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది.అపస్మారక స్థితిలో ఉన్న కుక్క ను చూసిన సిఐ కరుణాకర వెంటనే పశు వైద్యులను స్టేషన్ వద్దకు పిలిపించి కుక్కకు దగ్గరుండి వైద్యం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న శునకానికి సెలైన్ పెట్టగా అక్కడే ఉండి పర్యవేక్షించారు… బ్రతికించు కోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు..కానీ.. పలించ లేదు..చివరికి ప్రాణాలు కోల్పోయింది..నిత్యం వారితో ఉండే శునకం ..మరణంతో చలించి పోయారు పోలీసులు. మృతి చెందిన శునకం కళేబరాన్ని స్టేషన్ సమీపం లో పాతి పెట్టి పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు…పోలీసులు మానవత్వం పై జంతు ప్రేమికులు ప్రసంశిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..