Home Remedies: ఈగల బెడదతో విసిగిపోతున్నారా? ఇలా చేస్తే ఇంటి గుమ్మం వద్దకు కూడా రావు..!

ఓవైపు వానలు పడుతున్నాయని సంతోషం.. మరోవైపు వానలతో పాటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని భయం.. వెరసి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం నెలకొంది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అవును, వర్షాకాలం వచ్చిందంటే చాలు..

Home Remedies: ఈగల బెడదతో విసిగిపోతున్నారా? ఇలా చేస్తే ఇంటి గుమ్మం వద్దకు కూడా రావు..!
House Fly
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 23, 2023 | 8:25 AM

ఓవైపు వానలు పడుతున్నాయని సంతోషం.. మరోవైపు వానలతో పాటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని భయం.. వెరసి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం నెలకొంది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అవును, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వర్షాలతో పాటు జబ్బులు కూడా వస్తాయి. దీనంతటికీ కారణం కలుషితమైన నీరు, ఆహారం, ఇతర అంశాలు ఉన్నాయి. వీటిలో ఈగలను చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో ఈగల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ వాలుతూ అనారోగ్యాకి కారణం అవుతాయి. ఆహారం, నీళ్లపై వాలడం.. వాటిని జనాలు తినడంతో అనారోగ్యానికి గురవుతుంటారు. ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. స్ప్రేలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వాడుతారు. అయితే, వీటితో పాటు.. మన ఇళ్లలోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలు కూడా ఈగలను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

1. ఈగల రాకుండా అడ్డుకోవడంలో బిర్యానీ ఆకులు సమర్థంగా పని చేస్తాయని చెప్పొచ్చు. బిర్యానీ ఆకులతో పొగ వేయడం ద్వారా ఈగలను తరిమేయొచ్చు. దీని వాసనను ఈగలు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాయి.

2. కర్పూరం కూడా ఈగలను తరిమేస్తుంది. పచ్చ కర్పూరాన్ని పొడి చేసి నీటిలో కలపాలి. ఆ తరువాత దానిని ఇళ్లంతా స్ప్రే చేయాలి. ఇలా చేయడం వలన ఘాటు వాసనకు అవి తట్టులేక వెళ్లిపోతాయి.

ఇవి కూడా చదవండి

3. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఈగలను అడ్డుకుంటాయి. వెనిగర్‌లో రెండు చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ను వేసి మిక్స్ చేయాలి. ఆ తరువాత దానిని ఇళ్లంతా స్ప్రే చేయాలి.

4. తొలసి ఆకులతో కూడా ఈగలను వెళ్ల గొట్టొచ్చు. కొన్ని తులసి ఆకులను రుబ్బి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దానిని నీటిలో కలిపి, ఆ తరువాత ఇళ్లంతా స్ప్రే చేయాలి. ఇలా చేయడం వలన ఈగల ఇంట్లోంచి వెళ్లిపోతాయి.

6. దాల్చిన చెక్క ఘాటు కారణంగా ఈగలు ఇంట్లోకి రావు. దాల్చిన చెక్కను పొడి చేసి, దానిని ఇంట్లో ఆయా ప్రాంతాలలో చల్లాలి. ఇలా చేస్తే ఇంట్లోకి ఈగలు రావు గాక రావు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..