Watch: బీఎండబ్ల్యూ కారులో మంటలు.. రద్దీగా ఉండే రోడ్డుపై బీభత్సం.. వైరల్ వీడియో చూడండి

మార్గమధ్యలో కారు తగలబడిపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో పొగ వ్యాపించటంతో చూసిన డ్రైవర్ 3 సిరీస్ జీటీ కారును ఆపి వాహనంలో నుంచి దూకేశాడు. తొలుత చిన్నగా కనిపించిన మంటలు కారు మొత్తం వ్యాపించాయి. దీంతో కారు మొత్తం మంటల్లో దగ్ధమైంది.

Watch: బీఎండబ్ల్యూ కారులో మంటలు.. రద్దీగా ఉండే రోడ్డుపై బీభత్సం.. వైరల్ వీడియో చూడండి
Bmw Car Caught Fire
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 25, 2023 | 8:31 PM

రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖరీదైన కారులో ఉన్నట్టుండి దట్టమైన పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో..కారులో ఉన్నవారు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు కూడా భద్రత కోసం పరుగులు తీశారు. కాలిపోతున్న ఆకుపచ్చ రంగు బిఎమ్‌డబ్ల్యూ కారు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైలోని రద్దీగా ఉండే ఓ రహదారిలో గ్రీన్ కలర్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ బయటకు దూకాల్సి వచ్చింది. పొగతో కాలిపోతున్న కారు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్‌ అవుతున్నారు.

సమాచారం ప్రకారం..కారు డ్రైవర్ 22 ఏళ్ల పార్థసారథిగా గుర్తించారు. సమయానికి కారులోంచి దూకి గాయపడకుండా తప్పించుకున్నాడు. తమిళనాడు రాజధానిలోని క్రోంపేటలో పార్థసారధి తిరువల్లికేణి నుంచి తిండివనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు నివేదిక పేర్కొంది. కారులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దాదాపు 30 నిమిషాల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డును క్లియర్ చేశారు.

ఇవి కూడా చదవండి

చెన్నైలో రద్దీగా ఉండే రోడ్డుపై గ్రీన్ కలర్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది. మార్గమధ్యలో కారు తగలబడిపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో పొగ వ్యాపించటంతో చూసిన డ్రైవర్ 3 సిరీస్ జీటీ కారును ఆపి వాహనంలో నుంచి దూకేశాడు. తొలుత చిన్నగా కనిపించిన మంటలు కారు మొత్తం వ్యాపించాయి. దీంతో కారు మొత్తం మంటల్లో దగ్ధమైంది.

అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షలు నష్టం వాటిల్లినట్టుగా అధికారులు అంచనా వేశారు. అయితే, ఈ లగ్జరీ కారు అరుణ్ బాలాజీ అనే వ్యక్తికి చెందినదిగా తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ