AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువుకున్నోడేనా? ఉపాధ్యాయ దంపతులపై పచ్చి బూతులతో రెచ్చిపోయిన డీఈవో.. కాల్ రికార్డ్ వైరల్

సోమవారం రోజున సదరు డీఈవోపై స్దానిక రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి డిఈవో అరాచకాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు .. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆయనపై విచారణ అధికారిని కూడా నియమించారు. ఇంతలోనే ఉపాధ్యాయునితో మాట్లాడిన కాల్ రికార్డ్ బయటకు రావడంతో ఛీ ఈయన ఇంతే అని ఉపాద్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు .

చదువుకున్నోడేనా? ఉపాధ్యాయ దంపతులపై పచ్చి బూతులతో రెచ్చిపోయిన డీఈవో.. కాల్ రికార్డ్ వైరల్
Call Recording
Sudhir Chappidi
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 25, 2023 | 10:04 PM

Share

కడప, జులై25: ఉపాధ్యాయులు అంటే పిల్లలకు మంచి బుద్ధులు నేర్పి వారిని సక్రమమైన మార్గంలో నడిపించేవారు అలాంటి ఉపాధ్యాయులను ఓ ఉన్నతాధికారి తనకు ఇష్టం వచ్చిన విధంగా దుర్భాషలాడుతూ యూజ్ లెస్ ఫెలో అంటూ రెచ్చిపోయారు. నోటికి వచ్చిన బూతులు, అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. డీఈవో అంటే ఏమనుకుంటున్నావోయ్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. కడప జిల్లా డిఈవో రాఘవరెడ్డి తీరు జిల్లాలోని ఉపాద్యాయులు అందరినీ భాదపెడుతుంది. ఉపాద్యాయుల పట్ల తాను వ్యవహరిస్తున్న తీరు నీఛంగా ఉంది .. ఈ రోజు ఓ ఉపాద్యాయిడుకి డిఈవో రాఘవరెడ్డి ఫోన్ చేసి మాట్లాడిన వాయిస్ రికార్డ్ అంతటా చర్చనియాంశం అయింది.

ఉపాధ్యాయుడు ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే యూజ్ లెస్ ఫెలో డిఈవో అంటే ఎమనుకుంటున్నావోయ్ అంటూ మాటలతో దాడి చేశారు. ఏవడో నాపై చెత్త రాతలు రాస్తే నువ్వెందుకు దానిన షేర్ చేస్తున్నావ్ అంటూ చిందులేశారు .. అంతేకాక మీ ఆవిడకు ఫోన్ ఇవ్వూ అంటూ చిర్రుబుర్రులాడాడు. సదరు ఉపాధ్యాయుడి భార్యతో కూడా ఫోన్‌లో మాట్లాడుతూ.. మీఆయనను సక్రమంగా ఉండమని చెప్పు.. నువ్వు కూడా స్కూల్ అసిస్టెంట్ వే కదా అంటూ మందలించాడు .. రేపు ఉదయం ఆఫీసుకురా .. వస్తూ నువ్వు షేర్ చేసిన పేపర్ కటింగ్ లు, మెసేజ్ లను పట్టుకుని ఆఫీసుకు రా..అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చాడు ఈ పెద్ద సారు.

ఇదిలా ఉంటే, సోమవారం రోజున సదరు డీఈవోపై స్దానిక రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి డిఈవో అరాచకాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు .. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆయనపై విచారణ అధికారిని కూడా నియమించారు. ఇంతలోనే ఉపాధ్యాయునితో మాట్లాడిన కాల్ రికార్డ్ బయటకు రావడంతో ఛీ ఈయన ఇంతే అని ఉపాద్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు .

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..