Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్.. లక్ష్యం దిశగా స్పేస్‌క్రాప్ట్.. విజయవంతంగా ఐదవ కక్ష్యలోకి..
Chandrayaan-3 Space mission: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈనెల 14న తిరుపతి జిల్లాలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి చంద్రయాన్ 3 ప్రయోగం జరిగింది. చంద్రయాన్ 3 ఉపగ్రహం భూమి చుట్టూ ప్రదక్షణలను విజయవంతం చేసుకుని చంద్రుడి వైపు ప్రయాణం మొదలు పెట్టింది. అయితే
చంద్రయాన్ 3 ప్రయాణంలో కీలక దశ పూర్తయింది.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈనెల 14న తిరుపతి జిల్లాలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి చంద్రయాన్ 3 ప్రయోగం జరిగింది. చంద్రయాన్ 3 ఉపగ్రహం భూమి చుట్టూ ప్రదక్షణలను విజయవంతం చేసుకుని చంద్రుడి వైపు ప్రయాణం మొదలు పెట్టింది. అయితే దీనిని ఎప్పటికీ అప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని ISTRAC సెంటర్ నుండి చంద్రయాన్..3 మాడ్యులర్ ని నియంత్రణ చేస్తూ ఉన్నారు. చంద్రయాన్ 3 ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండిస్తూ రైజింగ్ ఆపరేషన్ ద్వారా ఆపోజి(భూమి నుంచి దూరాన్ని) పెంచుకుంటూ పోతూ ఉన్నారు.
అందులో భాగంగానే ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగు సార్లు ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్ లు విజయవంతంగా పూర్తి చేసి మంగళవారం మధ్యాహ్నం ఐదవ ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్ కూడా జరిగింది. బెంగళూరులోని ఇస్ ట్రాక్ సెంటర్ వద్ద ఐదవ ఆర్బిట్ రైజింగ్ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసి భూమికి అతి దగ్గరగా 236 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ ..3 ఉపగ్రహాన్ని ఉంచి భూమికి అతి దూరంగా అంటే దాదాపుగా 1,27,609 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ ..3 మాడ్యులర్ ప్రయాణిస్తోంది..
ల్యాండర్ ని ప్రొఫెల్షన్ మాడ్యులర్ ని చంద్రునికి దగ్గరగా చేర్చడం జరుగుతూ ఉంది.. ఇలాంటి రైజింగ్ ఆపరేషన్ లు ఇస్రో శాస్త్రవేత్తలు ఇంకా మరి కొన్ని దశల్లో చంద్రయాన్ ..3 ఉపగ్రహాన్ని చంద్రునికి దగ్గరగా పంపుతూ, ప్రొఫల్సన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్ను చంద్రుని కక్ష పైకి దింపే క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని ఇస్ ట్రాక్ సెంటర్ నుంచి చేపడుతున్నారు.. ఆగస్టు 1 న మరో సారి రైజింగ్ ఆపరేషన్ చేపట్టి చంద్రుడికి మరింత దగ్గరగా చేర్చనుంది.. అంతా సవ్యంగా జరిగితే ఆగస్టు 23 న చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ చేపట్టనుంది ఇస్రో..
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం