- Telugu News Photo Gallery Technology photos IQoo launching new smartphone iQoo Z7 Pro features and price details
iQoo Z7 Pro: భారత మార్కెట్లోకి ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్.. కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు అదిరిపోయే ఫీచర్లు
ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోన్న.. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ తాజాగా మీడియం రేంజ్ బడ్జెట్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఐకూ జెడ్7 ప్రో పేరుతో తీసుకురానున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jul 25, 2023 | 9:45 PM

ఐకూ కంపెనీ భారత మార్కెట్లోకి త్వరలోనే ఐకూ జెడ్7 పేరుతో ఓ 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వచ్చే నెల మిడిల్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో తీసుకురానున్నారు.

ఈ ఫోన్‌లో ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రటన రాలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కథనాల ప్రకారం కొన్ని ఫీచర్లు బయటకు వచ్చాయి.

వీటి ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ధర విషయానికొస్తే రూ. 25 నుంచి రూ. 30 వేల మధ్యలో ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.





























