Hyderabad: ఆపద్బాంధవులుగా మారిన పోలీసులు.. ఆఖరు నిమిషంలో ఆ తల్లికి ప్రాణం పోశారు..

Vanasthalipuram: పరిస్థితి తీవ్రత ను గమనించి క్షణాల్లో అక్కడికి వెళ్లిన పోలీసులు మహిళను కాపాడిన తీరును అందరూ ప్రశంశిస్తున్నారు. విధి నిర్వహణ లో ధైర్య సాహసం చేసిన పోలీసులను అభినందించారు రాచకొండ సీపీ డిఎస్ చౌహన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ. మొత్తానికి పోలీసులు తమ మీద ఉన్న అపవాదు ను ఈ ఒక్క ఘటన తో పోలీసులు పోగొట్టుకున్నారు.

Hyderabad: ఆపద్బాంధవులుగా మారిన పోలీసులు.. ఆఖరు నిమిషంలో ఆ తల్లికి ప్రాణం పోశారు..
Hyderabad Police
Follow us
Ranjith Muppidi

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 25, 2023 | 10:17 PM

హైదరాబాద్, జులై 25:  దొంగలు పడ్డ తర్వాత ఆరు నెలలకు కుక్కలు మొరుగుతాయన్నట్టుగా..పోలీస్ శాఖ పై విమర్శలు ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో పోలీసులు వచ్చి ఓ ప్రాణాన్ని నిలబెట్టిన ఘటన చర్చకు దారి తీసింది. ఈ సంఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లో పిల్లలు ఉండగానే రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకుంది మహిళ. దింతో పిల్లలు కిటికీ లో నుండి చూసే వరకు ఫ్యాన్ కు చున్నీ బిగిస్తుంది. దింతో షాక్ తిన్న పిల్లలు చుట్టుపక్కల వారిని పిలిచిన డోర్ తెరవలేదు. దీంతో పిల్లలు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు.

కాల్ వచ్చిన 4నిమిషాలకే అక్కడికి చేరుకున్న ఎఎస్సై సురేందర్ రెడ్డి కానిస్టేబుల్ రాము డోర్ ఓపెన్ చేయాలని గట్టిగా అరిచారు. దింతో ఓపెన్ చేయకపోవడం డోర్ బద్దలు కొట్టి మహిళను కాపాడారు. అప్పటికే ఉరి వేసుకొని ఉండటంతో మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దింతో వెంటనే సీ పీ ఆర్ చేసి స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉంది.

సకాలంలో పోలీసులు స్పందించిన తీరు అందరిని ఆలోచింపజేసింది. పరిస్థితి తీవ్రత ను గమనించి క్షణాల్లో అక్కడికి వెళ్లిన పోలీసులు మహిళను కాపాడిన తీరును అందరూ ప్రశంశిస్తున్నారు. విధి నిర్వహణ లో ధైర్య సాహసం చేసిన పోలీసులను అభినందించారు రాచకొండ సీపీ డిఎస్ చౌహన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ. మొత్తానికి పోలీసులు తమ మీద ఉన్న అపవాదు ను ఈ ఒక్క ఘటన తో పోలీసులు పోగొట్టుకున్నారు. భవిష్యత్ లో ఇలానే పోలీసులు పని చేస్తారని ఆశిద్దాం..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..