Telangana: జోరువానలో సందడి చేసిన పసిడివర్ణం కప్పలు.. చేపలతో పోటీపడుతూ ఆటలు.. వీడియో వైరల్..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. కప్పలు సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ వర్షాలు ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో.. కప్పలు పెద్దగా కనబడలేదు. కప్పలు బెక బెక శబ్దాలు చేస్తూ హడావుడి చేస్తాయి.. మనకు కప్పలు ఎలా ఉంటాయో తెలుసు. కానీ పచ్చని గడ్డిలో పసిడి వర్ణంలో కప్పల సమూహం సందడి చేసింది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో శాంతినగర్..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. కప్పలు సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ వర్షాలు ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో.. కప్పలు పెద్దగా కనబడలేదు. కప్పలు బెక బెక శబ్దాలు చేస్తూ హడావుడి చేస్తాయి.. మనకు కప్పలు ఎలా ఉంటాయో తెలుసు. కానీ పచ్చని గడ్డిలో పసిడి వర్ణంలో కప్పల సమూహం సందడి చేసింది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో శాంతినగర్ శివాలయం ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పసిడి రంగులో ఉన్న కప్పలు బయటికి వచ్చి నీటిలో దూకుతూ అరుపులతో ఆకర్షించాయి. వర్షానికి పంట పొలంలోకి వచ్చిన చేపలతో కప్పలు పోటీపడ్డాయి. ఆట ఆడుతూ సందడి చేశాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు సెల్ ఫోన్లు కెమెరాలు క్లిక్ మనిపించారు. ఇది చూపర్లను ఎంతో ఆకర్షించాయి. అధిక వర్షం కురిసినప్పుడు ఇవి బయట ప్రాంతంలో కనిపిస్తుంటాయని స్థానికులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
