AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సినిమాను మించిన సీన్.. రయ్‌మంటూ దూసుకొచ్చిన మూడు కార్లు.. చూస్తుండగానే ఆ పిల్లాడిని..

స్కూల్‌కు వెళ్లి వస్తున్న ఓ బాలుడి కోసం పది మంది.. మూడు కార్లలో వచ్చి దాడి చేసి ఎత్తుకుపోయారు. సినీ ఫక్కీలో రెక్కీ చేసి బాలుడిని తమ వెంట తీసుకువెళ్ళారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా చేజ్ చేశారు. అయితే వారు చిక్కినట్లే చిక్కి పారిపోయారు. ఆ బాలుడిని ఎవరూ ఎత్తుకు వెళ్లారు? ఎందుకు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే..

Telangana: సినిమాను మించిన సీన్.. రయ్‌మంటూ దూసుకొచ్చిన మూడు కార్లు.. చూస్తుండగానే ఆ పిల్లాడిని..
Kidnap
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 25, 2023 | 9:47 PM

Share

స్కూల్‌కు వెళ్లి వస్తున్న ఓ బాలుడి కోసం పది మంది.. మూడు కార్లలో వచ్చి దాడి చేసి ఎత్తుకుపోయారు. సినీ ఫక్కీలో రెక్కీ చేసి బాలుడిని తమ వెంట తీసుకువెళ్ళారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా చేజ్ చేశారు. అయితే వారు చిక్కినట్లే చిక్కి పారిపోయారు. ఆ బాలుడిని ఎవరూ ఎత్తుకు వెళ్లారు? ఎందుకు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే..

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సైదేశ్వర్ రావు కూతురు పృథ్వి రమణను హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌తో పెళ్లి చేశారు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలంగా భర్త ప్రవీణ్, భార్య పృథ్వి రమణల మధ్య మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భార్య రమణ తన కుమారుడు కార్తికేయను కోదాడలోని తల్లితండ్రుల వద్ద విడిచి ఉద్యోగరీత్యా కెనడాకు వెళ్ళింది. అప్పటి నుండి కార్తికేయ అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. పృధ్వి రమణ ప్రవీణ్ ల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో కార్తికేయను.. తండ్రి ప్రవీణ్‌తో కలవకుండా అత్తమామలు చేస్తున్నారు. దీంతో తండ్రి ప్రవీణ్ కోర్టును ఆశ్రయించాడు. వారానికి ఒక సారి కుమారుడిని చూసేలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన కుమారుడు కార్తికేయను కలవనీయకుండా అత్తామామలు అడ్డుపడుతున్నారంటూ ఈ ఏడాది మార్చిలో కోదాడలోని అత్తమామలు ఇంటి ముందు ప్రవీణ్ ధర్నా చేశాడు.

అయితే ఇటీవల కోర్టు కుమారుడు కార్తికేయ సంరక్షణ బాధ్యతను తండ్రి ప్రవీణ్ కు ఇచ్చింది. దీంతో సినీ ఫక్కీలో పదిమంది మూడు కార్లల్లో వచ్చి స్కూల్ వద్దకు వచ్చారు. ఇంటికి వెళ్తున్న అమ్మమ్మ తాతయ్యలపై దాడి చేసి కార్తికేయను ఎత్తుకెళ్లారు. ఇదంతా సమీప సీసీ టీవీ లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో కోదాడలో వైరల్ గా మారింది. ఘటన నేపథ్యంలో మామ సైదేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సినీ ఫక్కీలో కార్లను చేజ్ చేసి నల్లగొండ జిల్లా కేతేపల్లి టోల్ దగ్గర పట్టుకున్నప్పటికి తండ్రి ప్రవీణ్ పోలీసులకు చిక్కలేదు. దీంతో దాడి చేసిన కారణంగా ప్రవీణ్ పై కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!