- Telugu News Photo Gallery This place in India sells cashews at the price of common veggies;less than tomato rate
Chepest diwali gift 2023: ఇక్కడ టమాటా కంటే జీడిపప్పు చౌక.. రోడ్లమీద కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు..
మంచి ఆరోగ్యం కోసం పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినాలని సూచిస్తారు వైద్యులు. అయితే, భారతదేశంలో కూరగాయల ధరలోనే జీడిపప్పును కొనుగోలు చేసే మార్కెట్ ఒకటి ఉందని మీకు తెలుసా..? దేశంలోని ఈ మార్కెట్‌లో జీడిపప్పు కిలో రూ. 100 కంటే తక్కువకే కొనుగోలు చేస్తుండగా, దేశవ్యాప్తంగా ఇప్పుడు టమాట ధర కిలో రూ.200లకు చేరింది.
Updated on: Jul 26, 2023 | 12:34 PM

జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో జీడిపప్పును కూరగాయల రేటుకు విక్రయిస్తున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మంచి జీడిపప్పు కిలో రూ.800-1000 కంటే తక్కువకు లభించడం లేదు.

ఎందుకంటే జార్ఖండ్‌లో ప్రతి సంవత్సరం వేల టన్నుల జీడిపప్పు ఉత్పత్తి అవుతుంది. జామతారా సమీపంలో 50 ఎకరాలకు పైగా భూమిలో జీడిపప్పును సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నారు.

జీడి సాగుకు జార్ఖండ్ వాతావరణం ఉత్తమమైనది. అందుకే 1990 నుంచి ఇక్కడ జీడిపంట సాగు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ జీడిపప్పు ప్రాసెసింగ్ కోసం బెంగాల్‌కు పంపబడింది. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం జార్ఖండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

జార్ఖండ్‌లోని పాకూర్, దుమ్కా, సెరైకెల్, డియోఘర్‌లలో కూడా జీడిపప్పు బంపర్ ఉత్పత్తి ఉంటుంది. ఇది చాలా వెనుకబడిన ప్రాంతం. ఎక్కడ పండు వచ్చిన వెంటనే రైతులు వాటిని పొలాల్లోంచి తీసి రోడ్డుపక్కన కుప్పలుగా పోసి విక్రయిస్తుంటారు.

జమ్తారా జీడిపప్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సరఫరా చేయబడుతుంది. చాలా ఏళ్ల క్రితం ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీశాఖ రైతులకు జీడి మొక్కలు ఇవ్వగా ప్రస్తుతం ఆ నారు వృక్షాలుగా మారింది.

Cashews




