అమెరికా టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్న్యూస్.. వీసా మంజూరుపై కీలక నిర్ణయం తీసుకున్న అగ్రరాజ్యం
కొవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం దెబ్బతింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మెల్లమెల్లగా కోలుకుంటోంది. పలు దేశాల్లో పరిస్థితులు కుదుటపడ్డాయి. కానీ అమెరికాలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
United States
Follow us
కొవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం దెబ్బతింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మెల్లమెల్లగా కోలుకుంటోంది. పలు దేశాల్లో పరిస్థితులు కుదుటపడ్డాయి. కానీ అమెరికాలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
అమెరికాలో పర్యాటకుల సంఖ్య అక్కడ జూన్ చివరినాటికి కరోనా మునుపటి పరిస్థితులతో పోల్చుకుంటే 26 శాతం తక్కువగా ఉంది. మరోవైపు ఇక్కడ పర్యాటకులు తగ్గిపోవడానికి ముఖ్య కారణం వీసా ప్రక్రియ అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా టూరిస్టు వీసా పొందాలంటే కనీసం 400 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. అందుకే అక్కడికి వెళ్లేందుకు చాలామంది మొగ్గు చూపడం లేదు. మరోవైపు యురోపియన్ యూనియన్, బ్రిటన్ దేశాలు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మెక్సికో, బ్రెజిల్, ఇజ్రాయిల్ తదితర దేశాల ప్రజలు ఎలాంటి వీసా లేకున్నా కూడా తమ దేశంలో పర్యటించేందుకు ఈయూ తెలిపింది.
అందుకోసమే అమెరికా పర్యాటకాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇండియా నుంచి అమెరికాకు ఎక్కవ మంది ఛాన్స్ ఉన్నందున వారికి టూరిస్ట్ వీసా సమయం తగ్గించి.. త్వరగా వీసా మంజూరు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే లాక్డౌన్ ముగిసిన అనంతరం అమెరికాకు విదేశాల నుంచి రాకపోకలు మొదలయ్యాక హోటల్ రేట్లు పెరిగిపోయాయి. దీంతో ఆ ఖర్చును భరించలేక ఇతర దేశాలు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు పలువులు చెబుతున్నారు.