- Telugu News Photo Gallery These 7 Natural Ingredients can help to Reduce Wrinkles, Know Here Details
Reduce Wrinkles Tips: నుదిటిపై ముడతలు వస్తున్నాయా? ఈ సహజ వస్తువులతో ఈజీగా చెక్ పెట్టండి..
Anti Aging Tips: వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు వస్తాయి. కానీ వయసుకు ముందే వయసు సంకేతాలు కనిపిస్తే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి నెలా పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకోవడం సాధ్యం కాదు. కానీ, ఇంట్లో ఉండే.. కొన్ని సహజ పదార్థాలతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ముఖంపై ముడతలను తగ్గించుకోవచ్చు.
Updated on: Jul 27, 2023 | 11:01 PM

వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు వస్తాయి. కానీ ముఖంలో వయసుకు ముందే వయసు సంకేతాలు కనిపిస్తే అస్సలు బాగోదు. చాలా మంది తమ చర్మ సౌందర్యం కోసం నిరంతరం పార్లర్‌కు వెళ్తుంటారు. అయితే, ఇది అందరికీ సాధ్యం కాదు. ఇంట్లోనే కొన్ని సహజ పదార్థాలతో సంరక్షించుకోవచ్చు. ముఖంపై ముడతలను తగ్గించుకోవచ్చు.

ముడతలు రాకుండా ముఖంపై తేనెను అప్లై చేయాలి. తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మం తేమను నిలుపుకోవడానికి తేనె సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు చర్మంపై తేనెను మసాజ్ చేయాలి. 15-20 నిముషాలు అలాగే ఉంచి, ఆ తరువాత ముఖం కడుక్కోవాలి.

అలోవెరాలో మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. తాజా కలబంద జెల్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి. కలబంద వల్ల చర్మం వృద్ధాప్యం ఛాయలు కూడా తగ్గుతాయి.

ముడుతలను నివారించడంలో కొబ్బరి నూనె అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల కొబ్బరి నూనెను చర్మంపై మసాజ్ చేయాలి.

ఆలివ్ ఆయిల్ గుండెతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ముఖంపై కొన్ని చుక్కల ఆలివ్ నూనెను మసాజ్ చేయాలి. చర్మంపై నూనె ఆరే వరకు మసాజ్ చేయాలి.

దోసకాయ.. ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచుతుంది. హైడ్రేటింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దోసకాయ కళ్ల చుట్టూ ముడతలను నివారిస్తుంది. దోసకాయను ముఖానికి రుద్దడమే కాకుండా కళ్లపై దోసకాయ ముక్కలను పెట్టుకోవచ్చు.

పెరుగు జీర్ణాశయానికి మేలు చేసినట్లుగానే.. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. పెరుగును ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా, ముడతలు రాకుండా చేస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. గ్రీన్ టీని ఫేస్ టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.





























