బెంగళూరుకి వచ్చేసిన డ్రైవర్ లేని కారు.. ఫిదా అవుతున్న నెటీజన్లు
రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో డ్రైవర్‌లెస్ కారులు రానున్నాయి. ఇప్పిటికే కొన్ని దేశాల్లో ఈ డ్రైవర్‌లెస్ కారులు తిరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా భారత్‌లోని బెంగళూరుల రోడ్లపై వింత ఆకారంలో ఉన్న డ్రైవర్‌లెస్ కారు తిరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
Updated on: Jul 27, 2023 | 7:57 PM

రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో డ్రైవర్‌లెస్ కారులు రానున్నాయి. ఇప్పిటికే కొన్ని దేశాల్లో ఈ డ్రైవర్‌లెస్ కారులు తిరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా భారత్‌లోని బెంగళూరుల రోడ్లపై వింత ఆకారంలో ఉన్న డ్రైవర్‌లెస్ కారు తిరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

బాలీవుడ్ సినిమాలోని కారు లాగా ఉందని ఓ వినియోగదారుడు ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన నెటీజన్లు డ్రైవర్ లేకుండా కూడా ఇంత ట్రాఫిక్‌లో ఎలా నడుస్తుందని ఆశ్చర్యపోయారు.

అయితే ఈ కారును జీప్యాడ్ అంటారని ఓ యూజర్ తెలిపాడు. సెల్ఫ్ డ్రైవింగ్ కారుని మైనస్ జీరో అనే అంకుర సంస్థ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డ్రైవర్ లేని వాహనం బెంగళూరు రోడ్లపై రెండుసార్లు కనిపించిందని అక్కడి స్థానికులు తెలిపారు.

టెస్టింగ్ చేసేందుకే ఇలా రోడ్లపై కారు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే ఇండియాలో మొట్టమొదటి స్వయంప్రతిపత్తి గల వాహనం కూడా ఇదే. అలాగే ఈ జీప్యా్డ్‌కు స్టీరింగ్ కూడా ఉండదు. ఎక్కువ రిజల్యూషన్‌తో ట్రాఫిక్‌లో కూడా ఇది నడుస్తోంది.

ఈ కారులో డ్రైవర్ లేని కారులో 6 కెమెరాలు పెట్టారు. వీటి సహయంతో ఈ వాహనం పరిస్థితులను అంచనా వేస్తుంది. ఒకవేళ ప్రమాదం అని తెలిస్తే వెంటనే ఆగుతుంది. ట్రాఫిక్ సమస్యను, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఈ వాహనాన్ని తీసుకొచ్చినట్లు మైనస్ జీరో సంస్థ వెల్లడించింది.