Tollywood: టాలీవుడ్ టు బాలీవుడ్ లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్.. కొత్త సినిమా ముచ్చట్లు మీకోసం.
కొత్త సినిమా అప్‌డేట్స్‌తో సందడి వాతావరణం నెలకొంది. మేకర్స్ సినీ లవర్స్‌కి అప్‌డేట్స్ ఇస్తూ ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగుతో పాటు హిందీ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన కొన్ని లేటెస్ట్ మూవీ ముచ్చట్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jul 27, 2023 | 7:51 PM

గదర్ 2 ట్రైలర్.. 2001లో ఇండియా పాక్ నేపథ్యంలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గదర్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు అనిల్ శర్మ. 20 ఏళ్ళ కింద కలిసి నటించిన సన్నీ డియోల్, అమీషా పటేల్ ఇప్పుడూ జంటగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తిమాన్ తల్వార్ కథ అందించారు. సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

సూపర్ స్టార్ జుజుబీ.. సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ నుంచి జుజుబీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. సెన్సేషనల్ సింగర్ ధీ ఈ పాటను పాడారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇదే సినిమాలోని కావాలయ్యా తెలుగు వర్షన్ పాటను రానా విడుదల చేసారు. ముఖ్యంగా జుజుబీ పాట అయితే ఇన్‌స్టంట్ హిట్ అయిపోయింది. సినిమా ఆగస్ట్ 10న విడుదల కానుంది.

పేక మేడలు బాహుబలి మూవీలో సేతుపతిగా నటించిన రాకేష్ వర్రే నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ రాకేష్ వర్రే నిర్మిస్తున్న సినిమా పేక మేడలు. ఈ సినిమాలో వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాతో నీలగిరి మామిళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఉస్తాద్ ట్రైలర్.. ఫలితాలతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తున్నారు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి. తాజాగా ఈయన హీరోగా, బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా ఫణిదీప్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్. ఆగస్ట్ 12న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, రొమాన్స్‌తో పాటు ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఉస్తాద్ ట్రైలర్ ఉంది. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని నమ్మకంగా ఉన్నారు సింహా.

వరుణ్ తేజ్ మూవీ అప్‌డేట్స్.. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా కరుణ కుమార్ తెరకెక్కించబోయే సినిమా ఓపెనింగ్ జులై 27న జరగనుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈమెకు ఇదే తొలి తెలుగు సినిమా. కాగా ఈ సినిమా 1970స్ నేపథ్యంలో రాబోతుందని తెలుస్తుంది. నానితో హాయ్ నాన్న నిర్మిస్తున్న వైరా క్రియేషన్స్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.




