AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crocodile: నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధుడు.. చివరకు మొసలి కడుపులో ఉన్నట్లు గుర్తింపు..

అసలు ఇలాంటివి జరుగుతాయా .. కలలో కూడా ఊహించని సంఘటన అంటూ ఆశ్చర్యపడ్డారు కూడా.. ఎందుకంటే 14 అడుగుల భారీ మొసలి కడుపులో వృద్ధుడు కనిపించాడు. మొసలి లోపల మృతదేహం లభ్యమైంది. అయితే పరిశోధకులకు లేదా వృద్ధుడిని వెదుకుతున్న బృందాలకు ఎలా తెలిసిందో తెలియదు. ఈ వింత ఘటన మలేషియాలోని తవావులో జరిగింది.

Crocodile: నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధుడు.. చివరకు మొసలి కడుపులో ఉన్నట్లు గుర్తింపు..
Crocodile
Surya Kala
|

Updated on: Jul 25, 2023 | 7:27 AM

Share

60 ఏళ్ల వృద్ధుడు నాలుగు రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం అతని కోసం అన్ని చోట్లా వెతుకుతోంది. చివరికి ఆ వృద్ధుడు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలుసుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రమే కాదు.. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు. అసలు ఇలాంటివి జరుగుతాయా .. కలలో కూడా ఊహించని సంఘటన అంటూ ఆశ్చర్యపడ్డారు కూడా.. ఎందుకంటే 14 అడుగుల భారీ మొసలి కడుపులో వృద్ధుడు కనిపించాడు. మొసలి లోపల మృతదేహం లభ్యమైంది. అయితే పరిశోధకులకు లేదా వృద్ధుడిని వెదుకుతున్న బృందాలకు ఎలా తెలిసిందో తెలియదు. ఈ వింత ఘటన మలేషియాలోని తవావులో జరిగింది.

మొసలి కడుపు లోపల ఉన్న బాడీ పార్ట్స్ గుర్తింపు కోసం పంపించగా.. అవి తాము వెదుకుతున్న ఆది బంగ్సా కు చెందినవి అని నిర్ధారించారు. మొసలి తల నరికిన సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు ఉన్నారని తవౌ ఫైర్ అండ్ రెస్క్యూ స్టేషన్ చీఫ్ జెమిషిన్ ఉజిన్ ధృవీకరించారు. మొసలి కడుపులోకి వృద్ధుడి అవశేషాలను వెలికితీయడానికి ముందు దానిని కాల్చి చంపారు. అనంతరం దాని కడుపులోని అవశేషాలు వెలికితీశారు. తరువాత తప్పిపోయిన రైతు ఆది బంగ్సాకి చెందినవి అని నిర్ధారించచారు.

వృద్ధుడు ఆది బంగ్సా గురించి వెదుకుతున్న నాల్గవ రోజున మగ ఎలిగేటర్ ఎరను మింగినట్లు జూ కి చెందిన ఓ వక్తి ద్వారా ఆది బంగ్సాను వెదుకుతున్న బృందానికి సమాచారం అందింది. ఇదే విషయాన్ని చీఫ్ ఉజిన్ ధృవీకరించారు. తమ విచారణలో జంతువు ఆ రైతుని మింగినట్లు నిర్ధారణ అయింది.. బంగ్సా మరణంలో దాని ప్రమేయం చెప్పారు.

ఇవి కూడా చదవండి

మొసలి బరువు 126 కిలోలు  జూలై 22 శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మొసలిని కాల్చి చంపారు. కొన్ని గంటల తర్వాత దాని కడుపు తెరిచారు. ఆది బంగ్సా ను చూడడానికి ఈ సమయంలో అతని కుటుంబం మొత్తం అక్కడే ఉంది.    126 కిలోల బరువు, 14 అడుగుల పొడవు ఉన్న మొసలి మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత శోధన బృందం చేపట్టిన ఆపరేషన్ ఉదయం 11 గంటలకు ముగిసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..