మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మంత్రి.. దెబ్బకు రాజీనామా
న్యూజిలాండ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ న్యాయశాఖ మంత్రి కారు డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనాలను ఢీకొట్టింది. చివరికి ఆమె తన పదవికే రాజీనామ చేయడం అందర్ని ఆశ్యర్యానికి గురిచేసింది.

న్యూజిలాండ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ న్యాయశాఖ మంత్రి కారు డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనాలను ఢీకొట్టింది. చివరికి ఆమె తన పదవికే రాజీనామా చేయడం అందర్ని ఆశ్యర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్ ఆదివారం రాత్రి మద్యం తాగి అతివేగంగా కారును నడిపారు. అలా వెళ్తుండగానే ఓ ప్రాంతంలో పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఆమె కారు ఢీకొట్టింది. సమాచారం మేరకు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి కిరి అలెన్‌కు బ్రీతింగ్ టెస్ట్ చేశారు. అందులో ఆమె లిమిట్ దాటి మద్యం సేవించినట్లు తేలింది.
ఈ క్రమంలో పోలీసలు ఆమెను అరెస్టు చేసేందుకు యత్నిచారు. కానీ ఆమె మాత్రం ఇందుకు అంగీకరించలేదు. వారితోనే ప్రతిఘటించారు. అయినా కూడా పోలీసులు చివరికి ఆ మంత్రిని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఆమెను దాదాపు 4 గంటల పాటు ఉంచారు. దీంతో ఇందుకు సంబంధించిన విషయం అంతటా ప్రచారమైంది. దీంతో ఆమె సోమవారం రోజున తన రాజీనామా చేసేసింది. ప్రస్తుతం ఆమె కోర్టులో ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంది.