Snake Farming: ఆ గ్రామంలో పాముల పెంపకమే ప్రధాన ఆదాయ వనరు.. ప్రతి వ్యక్తి 30 వేల పాముల పెంపకం.. కోట్లలో సంపాదన..

ఇక్కడ పాములను గాజు, చెక్క పెట్టెల్లో పెంచుతారు. అవి పెద్దయ్యాక వాటిని కబేళాకు తీసుకెళ్లే ముందు వాటి విషాన్ని బయటకు తీస్తారు. అనంతరం ఆ పాములను చంపిన తరువాత మాంసం, ఇతర అవయవాలను వేరు చేస్తారు. దీంతో పాటు వాటి చర్మాలను తీసి ఎండలో ఆరబెడతారు. వాటి మాంసాన్ని ఆహారం, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు

Snake Farming: ఆ గ్రామంలో పాముల పెంపకమే ప్రధాన ఆదాయ వనరు.. ప్రతి వ్యక్తి 30 వేల పాముల పెంపకం.. కోట్లలో సంపాదన..
Snake Farming In China
Follow us
Surya Kala

|

Updated on: Aug 12, 2023 | 11:13 AM

భారతదేశం వ్యవసాయ దేశం. ఇక్కడ ప్రజలు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి రకాలను  పండిస్తారు. చేపల పెంపకం, కోళ్ళ పెంపకంతో పాటు వివిధ రకాల ఫలసాయాన్ని ఇచ్చేవి అంటే తేనెటీగల పెంపకం వంటివి కూడా వ్యవసాయానికి సంబంధించినవే.. అయితే  మీరు పాములను పెంచండి అని చెబితే.. భయంతో గజగజా వణుకుతారు.. అయితే ఈ రోజు భారీ ఆదాయాన్ని ఇస్తున్న పాములను పెంపకం గురించి తెలుసుకుందాం.. వస్తవానికి  పామును చూడగానే పారిపోతారు.. లేదంటే చంపేస్తారు.. అయితే పాములను పెంచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న దేశం ఒకటి ఉంది. ఆ దేశం ప్రపంచంలో అందరికి పరిచయం ఉన్నదే.. తమ తిండికి సంబంధించిన అలవాట్లతో మీడియాలో తరచుగా నిలుస్తూనే ఉంది. అవును ఈ దేశంలోని కొన్ని గ్రామాల ప్రజలు పాముల పెంపకాన్ని చేపట్టి. కోట్లలో సంపాదిస్తున్నారు.

పాములను పెంచుతున్న దేశం చైనాలోని జిసికియావో గ్రామంలోని ప్రజలు పాములను పెంచుతూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలోని ప్రజల ప్రధాన ఆదాయ వనరు పాముల పెంపకం. దీని కారణంగా ఈ గ్రామాన్ని స్నాక్ విలేజ్ అని కూడా పిలుస్తారు.

ప్రపంచవ్యాప్తంగా పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లో పాములను పెంచుతారు. ఈ గ్రామ జనాభా సుమారు వెయ్యి మంది.. అయితే ప్రతి వ్యక్తి 30,000 పాములను పెంచుతాడు. తమ ఇళ్లనే పాముల పెంపకానికి ఆవాసంగా చేసుకుంటాడు. ఇక్కడ ప్రతి ఏటా కోటి పాములు అమ్మకం జరుగుతాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పాము మాంసంతో లాభాలు

ఈ గ్రామంలో పెంచే పాములలో విషరహితమైనవి మాత్రమే కాదు.. విషం కలిగిన ప్రమాదకరమైన పాములు కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీటి నుంచి సేకరించిన చిన్న చుక్కతో 20 మందిని చంపగల నాగుపాములు ఉన్నాయి. కొండచిలువలు లేదా కొన్ని రకాల పాములు కాటు వేస్తే.. కొన్ని నిమిషాల్లోనే బాధితులు పిచ్చివాళ్లు అవుతారు. ఇవి మాత్రమే కాదు అత్యంత భయంకర ప్రమాదకరమైన జాతుల పాములను కూడా పెంచుతారు.

ఈ గ్రామంలో పుట్టిన చిన్నారి బొమ్మలకు బదులు పాములతో ఆడుకుంటుంది. ఇక్కడ ఉన్నవారికి అస్సలు భయం ఉండదు. ఎందుకంటే వీరు పాముల పెంపకం ద్వారా సంపాదిస్తారు. పాము మాంసం, ఇతర శరీర భాగాలు, దీని విషాన్ని మార్కెట్‌లో అమ్మడం ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. పాము విషం బంగారం కంటే విలువైనదని.. అత్యంత ప్రమాదకరమైన పాము ఒక లీటర్ విషం ఖరీదు 3.5 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

చైనాలో పాము మాంసాన్ని కూడా తింటారు. ఈ గ్రామస్థులు పాములను అమ్మి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో పనీర్ తినే విధంగా అక్కడ పాము మాంసం తింటారు. పాము కూర, పులుసు ఆదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహార పదార్ధాలు. అంతే కాకుండా పాముల భాగాలు ఔషధ తయారీకి ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాన్సర్‌కు సంబంధించిన మందులను కూడా తయారు చేస్తారు.

ఇక్కడ పాములను గాజు, చెక్క పెట్టెల్లో పెంచుతారు. అవి పెద్దయ్యాక వాటిని కబేళాకు తీసుకెళ్లే ముందు వాటి విషాన్ని బయటకు తీస్తారు. అనంతరం ఆ పాములను చంపిన తరువాత మాంసం, ఇతర అవయవాలను వేరు చేస్తారు. దీంతో పాటు వాటి చర్మాలను తీసి ఎండలో ఆరబెడతారు. వాటి మాంసాన్ని ఆహారం, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. అంతేకాదు చర్మాన్ని ఖరీదైన బెల్టులు మరియు ఇతర వస్తువులను తయారు చేస్తారు.

ఈ ఆలోచన ఎలా పుట్టిందంటే..

కొంతకాలం క్రితం యెంగ్ హాంగ్ చెంగ్ అనే రైతు ఇక్కడ నివసించేవాడు. ఒకరోజు అతను చాలా అనారోగ్యానికి గురయ్యాడు, పేదరికం కారణంగా అతను డబ్బును సేకరించలేకపోయాడు. ఈ సమయంలో అతను తన వ్యాధిని తానే తగ్గించుకోవాలని.. ఒక అడవి పామును పట్టుకుని దాని నుండి ఔషధం తయారుచేశాడు. అప్పుడు పాములు మనుషులను చంపడమే కాదు.. అది రక్షిస్తుంది కూడా అని గుర్తించాడు. పాము భాగాలతో తయారు చేసిన ఔషధం ద్వారా ప్రజల ప్రాణాలను కూడా రక్షించవచ్చని చెంగ్ భావించాడు.

ఇవన్నీ చూసి పాముల పెంపకం ప్రారంభించి ఎంతో ప్రయోజనం పొందాడు. చెంగ్‌ను చూసి, గ్రామంలోని ఇతర వ్యక్తులు కూడా పాములను పెంచడం ప్రారంభించారు. త్వరలోనే ఇక్కడి ప్రజలు ఈ పనిని తమ వృత్తిగా చేసుకున్నారు. ఈ ఊరి ప్రజలకు ఒక రకమైన విషపూరిత పాము అంటే భయం తప్ప.. మిగితా పాములంటే భయం లేదు.

ఈ పాము ఎవరినైనా కాటేస్తే.. ఆ వ్యక్తి ఐదు అడుగులు కూడా నడవలేక చనిపోతారని చెబుతారు. అత్యంత శక్తి వంతమైన విషం కారణంగా, మార్కెట్‌లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని పెంచడానికి కొన్ని ప్రత్యేక రకాల చెట్లు అవసరం. అవి అక్కడే పెరుగుతాయ. అయితే, కరోనా మహమ్మారి కారణంగా, చైనా ప్రభుత్వం ఈ గ్రామంలో 6 నెలల పాటు పాము పెంపకాన్ని నిషేధించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..