African Land Snails: మహిళ జీవితాన్నే మార్చేసిన ఒక ఐడియా.. ఇపుడు నెలనెలా లక్షల్లో సంపాదన..

ఆఫ్రికా నివాసి క్రిస్ బక్లీ అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన నత్తలను పండిస్తోంది. ఈ నత్తలు  దాదాపు 10 అంగుళాల వరకు పెరుగుతాయి. వీటిని ఆఫ్రికన్ ల్యాండ్ నత్తలు అంటారు. జర్మనీ నివాసి అయిన క్రిస్ తన కొడుకు చికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ నత్తలపై ఆసక్తి కలిగిందని పేర్కొంది. అప్పటి నుండి ఈ నత్తనల పెంపకంపై ఆసక్తి పెరగడం ప్రారంభించడంతో.. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయవలసిన అవసరం లేకుండా పోయిందని తెలిపింది. 

African Land Snails: మహిళ జీవితాన్నే మార్చేసిన ఒక ఐడియా.. ఇపుడు నెలనెలా లక్షల్లో సంపాదన..
African Women Kris Buckley
Follow us
Surya Kala

|

Updated on: Aug 26, 2023 | 8:32 AM

వర్షాకాలంలో రోడ్లపై, ఇళ్లపై, గోడలపై నత్తలు కనిపించడం మామూలే అయినా.. ఈ నత్తతో ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చని తెలుసా. అవును ఈ విషయాన్ని క్రిస్ బక్లీ అనే మహిళ వెల్లడించింది. టిక్‌ టాక్‌లో వీడియోను షేర్ చేసి.. ఆ మహిళ తనకు ఆఫ్రికాలో ఐదు వేలకు పైగా నత్తలు ఉన్నాయని చెప్పింది. వీటి నుంచి ప్రతినెలా లక్షల రూపాయలను సంపాదిస్తున్నట్లు పేర్కొంది.

మీడియా కథనాల ప్రకారం ఆఫ్రికా నివాసి క్రిస్ బక్లీ అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన నత్తలను పండిస్తోంది. ఈ నత్తలు  దాదాపు 10 అంగుళాల వరకు పెరుగుతాయి. వీటిని ఆఫ్రికన్ ల్యాండ్ నత్తలు అంటారు. జర్మనీ నివాసి అయిన క్రిస్ తన కొడుకు చికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ నత్తలపై ఆసక్తి కలిగిందని పేర్కొంది. అప్పటి నుండి ఈ నత్తనల పెంపకంపై ఆసక్తి పెరగడం ప్రారంభించడంతో.. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయవలసిన అవసరం లేకుండా పోయిందని తెలిపింది.

ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే ..

తన వ్యాపారం గురించి మాట్లాడుతూ తాను పెంచుకుంటున్న నత్తలు ప్రతి ఒక్కటి ప్రపంచంలో పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పాడు. ఈ నత్తలు ఒక్కొక్కటి 60 యూరోల వరకు అమ్ముడవుతాయి. క్రిస్  ఆసుపత్రిలోనే ఈ నత్తలను ఇష్టపడింది.. దీంతో మార్కెట్ నుండి 60 యూరోలకు ఒక నత్తను కొనుగోలు చేసింది. క్రమంగా.. ఈ నత్తపై ఇష్టాన్ని పెంచుకుంది. అలాఒక నత్తతో మొదలైన పెంపకం క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు క్రిస్ వద్ద 5000 వేలకు పైగా ప్రత్యేకమైన నత్తలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

తన వీడియోల్లో క్రిస్ నత్తలపై పెంచుకున్న ఇష్టం ఈ రోజు తన జీవితం మొత్తం మార్చివేసిందని తరచుగా ప్రజలకు చెబుతుంది. ఒకప్పుడు తాను సంపాదన కోసం ఇంట్లో వారిపై ఆధారపడే దానిని అని.. ఈ రోజు తన  ఈ ఆలోచన వల్ల తన దగ్గర చాలా డబ్బు ఉందని.. జీవితాన్ని హాయిగా గడుపుతున్నానని చెప్పాడు. దీనితో పాటు తన వ్యాపారంలో సహాయం కోసం ముగ్గురిని నియమించుకున్నానని పేర్కొంది. ఈ రోజు తనకు నత్తల పెంపకంతో మంచి కార్పొరేట్ ఉద్యోగి కంటే ఎక్కువ జీతాన్ని అందుకుంటున్నట్లు పేర్కొంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..