AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruby Roman Grapes: ప్రపంచంలో అత్యంత కాస్టిలీ ద్రాక్ష.. ఒక గుత్తి ధరతో మనదేశంలో 8 గ్రా. బంగారం కొనవచ్చు తెలుసా..

ఈ ద్రాక్ష కిలో వేలల్లో కాదు లక్షల రూపాయల్లో అమ్ముడవుతోంది. ప్రపంచంలోని ధనవంతులు మాత్రమే దీనిని తింటారు. విశేషమేమిటంటే ఈ ద్రాక్షను కూడా అన్ని చోట్లా సాగు చేయలేరు. ఈ ఖరీదైన ద్రాక్షను జపాన్‌లో మాత్రమే సాగు చేస్తారు. ఎందుకంటే అక్కడి వాతావరణం మాత్రమే దీనికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఈ ఖరీదైన ద్రాక్ష గురించి తెలుసుకుందాం.. 

Ruby Roman Grapes: ప్రపంచంలో అత్యంత కాస్టిలీ ద్రాక్ష.. ఒక గుత్తి ధరతో మనదేశంలో 8 గ్రా. బంగారం కొనవచ్చు తెలుసా..
Ruby Roman Grapes
Surya Kala
|

Updated on: Aug 19, 2023 | 11:28 AM

Share

ద్రాక్ష పండ్లను అందరూ ఇష్టపడతారు. ఇది దాదాపు అన్ని దేశాలలో ద్రాక్షను సాగు చేస్తారు. ఎన్నో రకాల ద్రాక్షలున్నా.. దాదాపు అన్ని దేశాల్లో దీని రేటు కూడా ఒకేలా ఉంటుంది. అయితే ఈ రోజు మనం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రాక్ష ఉందని మీకు తెలుసా.. ఈ ద్రాక్ష ధర తెలిస్తే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ద్రాక్ష కిలో వేలల్లో కాదు లక్షల రూపాయల్లో అమ్ముడవుతోంది. ప్రపంచంలోని ధనవంతులు మాత్రమే దీనిని తింటారు. విశేషమేమిటంటే ఈ ద్రాక్షను కూడా అన్ని చోట్లా సాగు చేయలేరు. ఈ ఖరీదైన ద్రాక్షను జపాన్‌లో మాత్రమే సాగు చేస్తారు. ఎందుకంటే అక్కడి వాతావరణం మాత్రమే దీనికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఈ ఖరీదైన ద్రాక్ష గురించి తెలుసుకుందాం..

రూబీ రోమన్ అనే ద్రాక్ష ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ఖ్యాతిగాంచింది. జపాన్‌లోని ఇషికావా ప్రాంతంలో ఈ ద్రాక్షను సాగు చేస్తారు. ఈ ద్రాక్ష గుత్తి ధర లక్షల రూపాయలు. విశేషమేమిటంటే రూబీ రోమన్ ద్రాక్షను మార్కెట్ లో అమ్మకానికి పెట్టరు. జస్ట్ వేలంలో దక్కించుకోవాల్సిందే..

ఈ ద్రాక్ష సాగు ఆసక్తికరం

రూబీ రోమన్ అనే ద్రాక్షసాగు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1995లో ఇషికావా ప్రాంతంలోని రైతులు ద్రాక్షపై పరిశోధనలు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను అభ్యర్థించారట.. అప్పుడు శాస్త్రవేత్తలు కొత్త రకాల ద్రాక్షను పండించవచ్చని చెప్పారు. అంతేకాదు రకరకాల పరిశోధన తర్వాత, శాస్త్రవేత్తలు ఎరుపు రంగులో కనిపించే వివిధ రకాల ద్రాక్షను అభివృద్ధి చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రయోగం కోసం 400 ద్రాక్ష తీగలను నాటారు

మొదట శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా 400 ద్రాక్ష తీగలను నాటారు. విశేషమేమిటంటే రెండేళ్ల తర్వాత 400 తీగలలో 4 ఎర్ర ద్రాక్షలు మాత్రమే పండించాయి. అప్పటి నుంచి ఈ ద్రాక్షను డవలప్ చేయడానికి మరింత పరిశోధన చేస్తూ.. శాస్త్రవేత్తలు  14 సంవత్సరాలు కష్టపడ్డారు. అప్పుడు ఈ ద్రాక్ష పరిమాణంలో మార్పులు వచ్చాయి. పూర్తిగా ఎర్రగా కెంపు రంగులో అందంగా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఈ ద్రాక్షకు “రూబీ రోమన్” అని పేరు పెట్టారు. అయితే మరికొందరు ఈ ద్రాక్షను “ఇషికావా నిధి” అని కూడా పిలుస్తారు.

అనేక పరిశోధన అనంతరం రూబీ రోమన్ ద్రాక్షను 2008 నుంచి భారీగా సాగు చేయడం ప్రారంభించారు. ఆ ఏడాది తొలిసారిగా రూబీ రోమన్ ద్రాక్ష మార్కెట్‌లోకి వచ్చింది. అప్పుడు 700 గ్రాముల ద్రాక్ష 73 వేల రూపాయలకు విక్రయించారు. అయితే 2016 సంవత్సరంలో ఈ రూబీ రోమన్ ద్రాక్ష గుత్తి ధర అనేక రేట్లు పెరిగి.. లక్షలకు చేరుకుంది. 2016 లో ద్రాక్ష గుత్తి ఒకటి 9 లక్షల రూపాయలకు అమ్మారు. రూబీ రోమన్ ద్రాక్ష కు 2020 సంవత్సరం లో వేలం పాట పెడితే ఈ ద్రాక్ష ఒక్క గుత్తిని 400 డాలర్లకు కొన్నారు. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 35,000.. అంటే ద్రాక్ష కొనుగోలు చేసిన డబ్బులు పెట్టి మన దేశంలో 8 గ్రాముల బంగారం కొనుగోలు చేయవచ్చు. అద్భుతమైన రుచికలిగిన ఈ ద్రాక్ష అత్యంత కాస్టిలీ ద్రాక్ష గురూ అనిపించుకుంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..