Watch: హై హై నాయకా..! మేకల మందపై కోతి ఫీట్లు.. గేదెలపై కుక్క సవారీ.. వైరలవుతున్న వీడియో..
బాహుబలి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా ఆవుల మందపై దూకుతూ హీరో ప్రభాస్ ముందుకు వెళ్ళే ఫైట్ సీన్ మామూలుగా ఉండదు..! అచ్చంగా అలాంటి సీనే రిపీట్ అయింది కానీ.. ఈ సీన్లో హీరో ప్రభాస్ కాదు ఓ కుక్క అంటే నమ్ముతారా..? అదేంటి అనుకుంటున్నారా ఇదిగో ఈ వీడియో చూడండి.
ఆంధ్ర,తెలంగాణ సరిహద్దులో గల గుబ్బలమంగమ్మ గుడికి వెళ్లే దారిలో గేదెలపై బాహుబలి స్టయిల్ లో ఫీట్లు చేస్తున్న కుక్క కనిపించడంతో ముచ్చటపడి తన సెల్ ఫోన్ లో వీడియో తీసి ఒక వ్యక్తి షేర్ చేశాడు… ఈ కుక్క చేసిన సరదా విన్యాసాన్ని చూసిన వారు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే గతంలో కూడా ఆంధ్ర,తెలంగాణ సరిహద్దు తాటియాకులగూడెం గ్రామం నుండి రోజు మేత కోసం అడవిలోకి వెళ్లి వచ్చే మేకల మందకు కోతి ఫీట్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి ,ఏది ఏమైనా జంతువులు వాటి పైనే పెత్తనం చెలాయిస్తూ వాటి స్నేహాన్ని చాటుకొంటున్నాయి..
ఇంటర్నెట్ ప్రపంచంలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతుంటారు. మరికొంతమంది అవాక్కవుతుంటారు.
ఇంటర్నెట్‌లో తరచుగా కనిపించే అనేక వీడియోల మధ్య, మనుషులు కుక్కలతో ఆడుకోవడం, పశువులకు ఆహారం ఇవ్వడం వంటి వాటి మధ్య, ఈ ప్రత్యేకమైన క్లిప్ రెండు ఎద్దులపై ఆనందంగా రైడ్ చేస్తున్న ఆహ్లాదకరమైన దృశ్యం కనిపించింది. ఒక కుక్క రెండు గేదెలపై నిలబడి హ్యాపీగా జర్నీ చేస్తోంది. ఎలాంటి గొడవా లేకుండా ఈ ముగ్గురూ కలిసి షికారు చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియోలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులంటే చాలా మంది ఎంతగానో ఇష్టపడుతుంటారు. వాటితో ఆడుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తుంటారు. పని ఒత్తిడిలో అలిసిపోయి ఇంటికొచ్చే వారికి పెంపుడు జంతువులు ఒక స్ట్రెస్ బూస్టర్ గా పనిచేస్తాయని చెప్పాలి. ఎందుకంటే పెంపుడు జంతువులు చేసే అల్లరి మనలోని ఒత్తిడిని ఇట్టే పొగోట్టెస్తాయి. అవి చేసే తమాషా పనులు, చిత్ర విచిత్రమైన చేష్టలు మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంకొన్నిసార్లు పెంపుడు జంతువులు చేసే అల్లరి చేష్టలను వీడియోలు తీసి మురిసిపోతుంటాం..ఆ వీడియోలను మనం మళ్లీ మళ్లీ చూస్తుంటాం..కుటుంబసభ్యులు, స్నేహితులకు చూపించి ఆ దృశ్యాన్ని వారితోనూ పంచుకుని నవ్వుకుంటుంటాం. ఇక గ్రామాల్లో ఇలాంటి గేదెలు, ఆవులు, ఎద్దులు, కోతులకు సంబంధించిన చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.