Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Murthy Birthday : మానవతా మూర్తి, పరోపకారి సుధామూర్తికి జన్మదిన శుభాకాంక్షలు..

తన వృత్తి జీవితంతో పాటు సుధామూర్తి ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేశారు. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే, ఆంగ్లములో డాలర్ బహు గా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది. సంఘ సేవని వీరు బాగా ఇష్టపడతారు.

Sudha Murthy Birthday : మానవతా మూర్తి, పరోపకారి సుధామూర్తికి జన్మదిన శుభాకాంక్షలు..
Sudha Murthy
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 19, 2023 | 8:24 AM

ప్రముఖ రచయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహిత, పరోపకారి సుధామూర్తి… ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య ‘సుధామూర్తి’ .. ప్రత్యేకించి పరిచయం అవసరమే లేని పేరు. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుధా మూర్తి పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరించి ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపిన మానవతా మూర్తి సుధామూర్తి పుట్టిన రోజు నేడు. ఆగస్టు 19, 1950లో కర్ణాటకలోని షిగ్గావ్‌లో జన్మించారు. ఆమె తండ్రి సర్జన్, తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. సుధా మూర్తి భారతదేశపు అతిపెద్ద ఆటో తయారీదారు టాటా ఇంజినీరింగ్, లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)లో పని చేసిన మొదటి మహిళా ఇంజనీర్.

సుధకు చిన్నప్పటి నుంచి చదువులంటే మక్కువ. ఆమె ఎప్పుడూ తన క్లాస్‌లో ఫస్ట్‌ ఉండేది. సుధ BVB కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి BE ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎం.ఇ పట్టా తీసుకున్నారు. సుధ కళాశాలలో 600 మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో 599 మంది అబ్బాయిలు, ఆమె ఒక్కతే అమ్మాయి. కర్ణాటకలోని అన్ని పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి సుధ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించారు. తద్వారా అక్కడ ఎంతో మంది పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడ్డారు. సుధా మూర్తి అనేక అవార్డులు, బిరుదులు అందుకున్నారు.

మూర్తి బి.వి.బి. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి (ప్రస్తుతం KLE టెక్నలాజికల్ యూనివర్సిటీ అని పిలుస్తారు), B.E. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. మొదటి ర్యాంక్ సాధించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి ఆమెను గోల్డ్‌ మెడల్‌తో సత్కరించారు. మూర్తి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో ME పూర్తి చేశారు. అక్కడ కూడా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంధాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. తన వృత్తి జీవితంతో పాటు సుధామూర్తి ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేశారు. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే, ఆంగ్లములో డాలర్ బహు గా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది. సంఘ సేవని వీరు బాగా ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

సుధా మూర్తి భారతదేశపు అతిపెద్ద ఆటో తయారీదారు టాటా ఇంజినీరింగ్, లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)లో పని చేసిన మొదటి మహిళా ఇంజనీర్. ఆమె కంపెనీలో డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా చేరింది. అయితే సుధకు ఈ ఉద్యోగం అతి సులువుగా వచ్చింది. టెల్కోలో డెవలప్‌మెంట్ ఇంజనీర్ పోస్టుకు సుధ దరఖాస్తు చేసినప్పుడు, ఆ పోస్టుకు మహిళా అభ్యర్థులెవరూ దరఖాస్తు చేసుకోలేదని సుధా గమనించారు..ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందిన భారతదేశంలో మొదటి మహిళా ఇంజనీర్‌గా సుధామూర్తి నిలిచారు. దీని తర్వాత ఆమె వాల్‌చంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో సీనియర్ సిస్టమ్ అనలిస్ట్‌గా చేరారు. సుధా మూర్తి సినిమాల్లో కూడా పనిచేశారు. సుధా మూర్తి తన సామాజిక సేవ, సాహిత్యానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కూడా.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..