AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vistara flight : విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికుల పడిగాపులు..

శుక్రవారం ఉదయం విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానాన్ని తనిఖీ చేశారు. లగేజీతో పాటు ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశారు. ఈరోజు ఉదయం 8:53 గంటలకు GMR కాల్ సెంటర్‌కు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో..

Vistara flight : విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికుల పడిగాపులు..
Vistara Flight
Jyothi Gadda
|

Updated on: Aug 18, 2023 | 1:50 PM

Share

విస్తారా విమానంలో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి కాల్‌ చేశాడు. దాంతో ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఢిల్లీ నుంచి పూణె వెళ్లాల్సిన విస్తారా విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్‌పోర్టు కాల్ సెంటర్‌కు శుక్రవారం ఉదయం ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రయాణికులను ఢిల్లీ విమానాశ్రయంలో దించేశారు . మొత్తం 100 మందికి పైగా ఫిల్‌ చేసిన ప్రయాణికులందరినీ తిరిగి తీసుకువచ్చిన తర్వాత విమానాశ్రయంలో వేచి ఉండాల్సిందిగా కోరామని, విమానాన్ని రిమోట్ బేకు తీసుకువెళుతున్నామని చెప్పారు.

విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్టుగా ఎయిర్‌లైన్ వర్గాలు తెలిపాయి. విమానం (UK-971) ఉదయం 8:30 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి 10:40 గంటలకు పూణే చేరుకోవాల్సి ఉంది. ఈ ఘటనను విస్తారా ధృవీకరించింది. తప్పనిసరి భద్రతా తనిఖీల కారణంగా ఆగస్ట్ 18న ఢిల్లీ నుండి పూణెకు వెళ్లాల్సిన UK971 విమానం ఆలస్యమైందని ఎయిర్‌ లైన్‌ వెల్లడించింది.

శుక్రవారం ఉదయం విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానాన్ని తనిఖీ చేశారు. లగేజీతో పాటు ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశారు. ఈరోజు ఉదయం 8:53 గంటలకు GMR కాల్ సెంటర్‌కు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయంలో బూటకపు కాల్ చేసినందుకు కాల్ చేసిన వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

గురుగ్రామ్‌లోని GMR కాల్ సెంటర్‌లో UK-971 ఢిల్లీ నుండి పూణే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది అని భద్రతా ఏజెన్సీ అధికారి మీడియాకు తెలిపారు. విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకుల లగేజీలన్నీ డి-బోర్డింగ్ చేయబడ్డాయి. ప్రయాణికులు ప్రస్తుతం టెర్మినల్ భవనంలో ఉన్నారని, వారికి అన్ని సదుపాయాలు సమర్చినట్టుగా అధికారి తెలిపారు.

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం, సెక్యూరిటీ ఏజెన్సీలు క్లియరెన్స్ ఇచ్చి, ఫ్లైట్‌ని కొనసాగించే వరకు విమానం షెడ్యూల్ చేయబడదు. సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి తుది క్లియరెన్స్ రాగానే విమానం గమ్యస్థానం (పుణె)కి బయలుదేరుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..