Aadhaar Card: ప్రధాన మంత్రి లోన్ స్కీమ్.. ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు రూ.3 లక్షలు ఇస్తారట.. అవునా..? నిజమా..?

ముందుగా బిజినెస్ లోన్ ఇస్తామంటూ  SMS వచ్చింది.  అందులో అతను లోన్ మొత్తంపై 35 శాతం సబ్సిడీకి అర్హత పొందాడు. అంతేకాకుండా, అతనికి మొదటి సంవత్సరం EMIలు చెల్లించడంపై మినహాయింపును కూడా ఇచ్చారు.. ఈ ఆఫర్‌కు ఆకర్షితుడై, బాధితుడు తన ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్, జీఎస్టీ వివరాలు, ఇతర పత్రాలను షేర్ చేసిన నంబర్‌కు అటాచ్ చేశాడు.

Aadhaar Card: ప్రధాన మంత్రి లోన్ స్కీమ్.. ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు రూ.3 లక్షలు ఇస్తారట.. అవునా..? నిజమా..?
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 18, 2023 | 11:41 AM

Aadhaar Card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. కేంద్ర ప్రభుత్వం రూ.3లక్షల లోన్ ఇస్తారట. ఈ మెసేజ్ ఇటీవల చాలా మంది ఫోన్లలో ప్రత్యక్షమైంది. దీన్ని చూసి చాలా మంది నిజమేమో అనుకుని నమ్మారు. కేవలం ఆధార్‌ ఆధారంగానే మూడు లక్షల లోన్‌ వస్తుందని ఎంతో సంబరపడిపోయారు. అయితే ఇదంతా ఓ ఫేక్ మెసేజ్ అని తేలిపోయింది. ఇలాంటి మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హెచ్చరించింది. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త ప్రకారం .. ప్రధాన మంత్రి లోన్ యోజన (పథకం) కింద ఆధార్ కార్డు హోల్డర్లు రూ. 3లక్షల వరకు రుణాన్ని పొందుతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త… ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకేనని పీఐబీ స్పష్టం చేసింది. వాస్తవాలను సరిగ్గా తనిఖీ చేయకుండా ఆధార్ కార్డు, బ్యాంక్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ షేర్‌ చేసుకోవద్దని పీఐబీ ప్రజలను కోరింది. ఈ వార్త తప్పు. అటువంటి పథకం ఏదీ భారత ప్రభుత్వం అమలు చేయడం లేదని స్పష్టం చేసింది.

ఇలాంటి మెసేజ్ వైరల్ కావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి అనేక తప్పుడు పథకాల పేరుతో ప్రజల్ని బురిడీ కొట్టించారు సైబర్‌ నేరగాళ్లు. ప్రభుత్వ పథకాలు, బ్యాంక్‌ స్కీంలను ఆసరాగా చేసుకుని ఇప్పటికీ ఇలాంటి తప్పుడు సందేశాలు, లింక్‌లు పంపుతూ అమాయకుల్ని నిలువునా ముంచేస్తున్నారని పీఐబీ వివరించింది. ఇలాంటి సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. సాధారణంగా ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణాలు అందిస్తూ ఉంటుంది. ఇందులో కూడా ఆధార్ కార్డు ద్వారా మాత్రమే రుణాలు ఇవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ముద్రా రుణాలను వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఇస్తుంటాయి. వీటిని పొందేందుకు లబ్ధిదారులు తమ ఆధార్, పాన్ కార్డులను రుజువుల కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ వ్యాపారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద 50 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పి 41 లక్షలు మోసం చేశారు.

వ్యాపారవేత్త మొబైల్ కు ముందుగా బిజినెస్ లోన్ ఇస్తామంటూ  SMS వచ్చింది.  అందులో అతను లోన్ మొత్తంపై 35 శాతం సబ్సిడీకి అర్హత పొందాడు. అంతేకాకుండా, అతనికి మొదటి సంవత్సరం EMIలు చెల్లించడంపై మినహాయింపును కూడా ఇచ్చారు.. ఈ ఆఫర్‌కు ఆకర్షితుడై, బాధితుడు తన ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్, జీఎస్టీ వివరాలు, ఇతర పత్రాలను షేర్ చేసిన నంబర్‌కు అటాచ్ చేశాడు.

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ వ్యాపారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద రూ.50 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పి రూ.41 లక్షలు మోసం చేశారు. సదరు వ్యాపారవేత్తకు మొదట్లో వ్యాపార రుణాన్ని అందిస్తామంటూ SMSను అందుకున్నాడు. అతను లోన్ మొత్తంపై 35 శాతం సబ్సిడీకి అర్హత పొందాడు. అంతేకాకుండా, అతను మొదటి సంవత్సరం EMIలు చెల్లించడంపై మినహాయింపును కూడా అందిస్తామన్నారు.. ఈ ఆఫర్‌కు ఆకర్షితుడై, బాధితుడు తన ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్, జీఎస్టీ వివరాలు, ఇతర పత్రాలను షేర్ చేసిన నంబర్‌కు పంపించాడు. PMEGP ఆఫీస్ నుండి ఎగ్జిక్యూటివ్ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, బాధితుడిని సెక్యూరిటీ డిపాజిట్‌గా 7,200 చెల్లించమని అడిగాడు. అతను ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఎగ్జిక్యూటివ్ రుణ ఆమోద పత్రాన్ని పంచుకున్నాడు. రుణం మొత్తం 72 గంటల్లో బాధితుడి బ్యాంక్ ఖాతాకు జమ అవుతుందని చెప్పారు.

కానీ ఇచ్చిన సమయం తర్వాత కూడా స్పందన లేకపోవడంతో, అతను ఎగ్జిక్యూటివ్‌కు ఫోన్ చేశాడు, అతను రుణ బీమా, ఆర్‌బిఐ ఛార్జీలు మొదలైన వాటికి ఛార్జీలు చెల్లించమని చెప్పాడు. 18.69 లక్షలు చెల్లించమని ఆదేశించాడు. ఆమోదించబడిన రుణాన్ని రద్దు చేస్తానని బెదిరించాడు. అతను చెల్లించలేదు. ఆ తర్వాత సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా చెప్పుకుంటూ మరో వ్యక్తి బాధితుడిని సంప్రదించాడు. మొదటి ఎగ్జిక్యూటివ్ మోసగాడని, 7.56 లక్షలు చెల్లించాలని బాధితుడిని కోరగా, బాధితుడు చెల్లించాడు. ఫండ్ ట్రాన్స్ ఫర్ అయిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు.

దీని తర్వాత కూడా PMEGP ఎగ్జిక్యూటివ్‌లుగా చెప్పుకుంటున్న పలువురు వ్యక్తులు బాధితుడిని సంప్రదించి, అతను మొత్తం 41,72,889 చెల్లించే వరకు అదే విధంగా మోసం చేశారు. ఎక్కువ చెల్లించాలని వారు డిమాండ్ చేయడంతో, అతను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం