భగవంతుడికి ప్రీతికరమైన ఈ పూలు మనిషి ఆరోగ్యానికి కూడా మంచివే!

కళ్లు, గొంతులో సమస్యల్ని నివారిస్తుంది. ఇది బ్రెయిన్ కి టానిక్ లా పనిచేసి..జ్ఞాపక శక్తిని పెంచుతుంది. తెలివితేటల్ని పెంచుతుంది. చర్మం, మూత్ర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది నయం చేస్తుంది. ఒత్తిడి, నీరసం, నిద్ర లేమి, కంటి చూపు సమస్యలు, జుట్టు రాలిపోవటం, చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పెప్టైడ్స్ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి.

భగవంతుడికి ప్రీతికరమైన ఈ పూలు మనిషి ఆరోగ్యానికి కూడా మంచివే!
Flowers
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 18, 2023 | 8:03 AM

ప్రకృతి ఒడిలో దొరికే కొన్ని పూలు దేవుడి పూజకు మాత్రమే కాకుండా.. మనిషి ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి! మనచుట్టూ కనిపించే వివిధ రకాల పూలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

మల్లెపూలు..

రోజు వాడే కొన్ని పువ్వులలో మల్లెలు ఒకటి. సువాసనతో అందరినీ ఆకర్షిస్తున్న పువ్వు ఏదైనా ఉందంటే అది మల్లెపువ్వే! ముఖ్యంగా జాస్మిన్ ఆయిల్ ను తలకు పట్టించి రెండు చేతులతో మసాజ్ చేయడం వల్ల వెంట్రుకలు పెరగడంతోపాటు స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీంతో పాటు జుట్టు సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి.

మందార పువ్వు..

మందార పూల రేకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి క్యాన్సర్ నుండి మనలను దూరంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

బంతి ఒక పువ్వు..

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పువ్వులో అధిక స్థాయిలో కనిపిస్తాయి. ఇది శరీరంలో మంటను కలిగించే కారకాలను తొలగిస్తుంది. అంతే కాకుండా కత్తితో కోసిన గాయాలు మొదలైన వాటిని బంతి పువ్వు రసం నయం చేస్తుంది. దగ్గు, చేతులు, కాళ్ళ చర్మం పగుళ్లు, గాయం విషయంలో కూడా మేరిగోల్డ్ ప్రయోజనకరంగా ఉంటుంది. మేరిగోల్డ్ కూడా గొప్ప సౌందర్య సాధనం.

సుగంధరాజ పుష్పం..

సుగంధరాజ పుష్పం కేవలం పూజలకే పరిమితం కాదు! ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది! ప్రధానంగా కంటి చూపు లోపాన్ని పోగొట్టడానికి, రక్తహీనత సమస్య నుండి బయటపడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు,జ్వరం, దగ్గు సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

గులాబీ పూలు..

చూడగానే ఎంతో అందంగా కన్పించే రోజా పూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రక్తశుద్ధి జరుగుతుంది. వీటికి వీర్యవృద్ధిని కలిగించే గుణం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు రోజా పూల రేకులను తీసుకోవ‌డం మంచిది. ముఖ్యంగా మీ చర్మానికి ఇది కొత్త మెరుపును అందిస్తుంది. ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు రోజ్ పూలను వాసన చూస్తే వెంట‌నే ఉపశమనం పొందొచ్చు. ఇక రోజా రేకుల‌ను తిన‌డం వ‌ల్ల‌ శరీరంలో మెటబాలిజం చక్కగా పనిచేస్తుంది. ప్రధానంగా శరీర బరువు తగ్గించుకోవడం, ఒత్తిడి, డిప్రెషన్ తొలగించడం, పైల్స్ సమస్యను నియంత్రించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

శంకు పుష్పాలు..

శంకు పుష్పాలను సంప్రదాయ మందుల్లో ఎక్కువగా వాడుతుంటార. కళ్లు, గొంతులో సమస్యల్ని నివారిస్తుంది. ఇది బ్రెయిన్ కి టానిక్ లా పనిచేసి..జ్ఞాపక శక్తిని పెంచుతుంది. తెలివితేటల్ని పెంచుతుంది. చర్మం, మూత్ర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది నయం చేస్తుంది. ఒత్తిడి, నీరసం, నిద్ర లేమి, కంటి చూపు సమస్యలు, జుట్టు రాలిపోవటం, చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పెప్టైడ్స్ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..