- Telugu News Photo Gallery Travel India: Here is the list of 5 Best Road Trips in India That You Must Take
Travel India: ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయడానికి ఈ ప్రాంతాలకు బైక్ మీద వెళ్లి చూడండి.. జీవితంలో మధురానుభూతినిస్తాయి..
భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతికి నెలవు కూడా.. ఆ సేతు హిమాచలంలో అనేక ప్రాంతాల్లో పర్వతాలు, జలపాతాలు, ప్రకృతి అందాలు కనుల విందు చేస్తాయి. అయితే కొన్ని ప్రాంతాలను సందర్శించాలంటే రైలు, విమానం వంటి రవాణా సాధనాలను ఉపయోగించాలి. అయితే కొన్ని ప్రాంతాలను బైక్ మీద వెళ్తూ ప్రకృతిని ఎంజాయ్ చేయడం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ ఉత్తమ రహదారి పర్యటనలను ఒకసారి ప్రయత్నించండి. దేశంలో అనేక ప్రదేశాలను రోడ్ ట్రిప్స్ ద్వారా మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ రోజు జీవితంలోనైనా ఒక్కాసారి చూడాలనుకునే టాప్ 5 రోడ్ ట్రిప్‌ల గురించి తెలుసుకోండి.
Surya Kala | Edited By: Ravi Kiran
Updated on: Aug 18, 2023 | 1:35 PM

భారతదేశంలో అనేక ప్రకృతి అందాలున్న నగరాలున్నాయి. ఈ ప్రాంతాలకు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి అక్కడకు చేరుకోవడం సరదాగా ఉంటుంది. ఇందులో లడఖ్ రోడ్ ట్రిప్ పేరు అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ రోజు రోడ్డు మార్గంలో ప్రయాణంలో పదనిసల గురించి తెలుసుకుందాం..

మనాలి నుండి లేహ్ ట్రిప్: లేహ్-లడఖ్ రోడ్ ట్రిప్ అత్యంత ఇష్టమైన అడ్వెంచర్ టూరిజంలో వస్తుంది. మనాలీ నుండి లేహ్ వరకు దేశప్రజలే కాకుండా విదేశీ పౌరులు కూడా ఆనందిస్తారు. మనాలీ నుండి లేహ్ వరకు దాదాపు 400 కిలోమీటర్లు ఉన్న రహదారిలో బైక్ మీద ప్రయాణం చేయడం ఓ వింతైన అనుభితినిస్తుంది.

భుజ్ నుండి ధోలవీర రోడ్ ట్రిప్: భుజ్ నుండి ధోలవీరకు బైక్ లేదా కారులో ప్రయాణించడం ఓ వింతైన అనుభితినిస్తుంది. ముందుగా కచ్ చేరుకుని.. అక్కడ నుంచి భుజ్ చేరుకుని తర్వాత ధోలావీరాకు చేరుకోండి. వలం 140 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణంను కేవలం 2 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. దారిపొడవునా అందమైన అనుభూతులను పోగు చేసుకోవచ్చు.

కోల్‌కతా నుండి డార్జిలింగ్: ఈ మార్గంలో ప్రయాణించే వారు దాదాపు 638 కిలోమీటర్లు డ్రైవింగ్ లేదా రైడ్ చేయాలి. ప్రయాణంలో చంద్రకేతు సహా అనేక ప్రసిద్ధ ప్రదేశాలను మార్గం మధ్యలో సందర్శించవచ్చు.

సిమ్లా నుండి కాజా: ఈ మార్గం దాదాపు 400 కిలోమీటర్లు.. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో నది ఒడ్డున లేదా పర్వతాల మధ్యలో వెళ్ళవచ్చు. ఢిల్లీలోని కశ్మీర్ గేట్ నుండి సిమ్లాకు బస్సు సౌకర్యం ఉంది. సిమ్లాలో ఉండటానికి.. 1000 నుండి 1500 రూపాయల మధ్య గది లభిస్తుంది.





























