- Telugu News Photo Gallery Cinema photos Dulquer Salmaan new stylish photos goes attractive in social media on 18 08 2023 Telugu actors Photos
Dulquer Salmaan: టాప్ గేర్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరో దుల్కర్.. స్టైలిష్ ఫొటోస్.
మలయాళ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. రొమాంటిక్ హీరో, మాస్ హీరో, సీరియల్ కిల్లర్, సపోర్టింగ్ యాక్టర్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం గన్స్ అండ్ గులాబ్ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంటున్నాడు. ఈ సందర్బంగా పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన యశ్, రిషబ్ శెట్టి లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Updated on: Aug 18, 2023 | 1:11 PM

మలయాళ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు.

రొమాంటిక్ హీరో, మాస్ హీరో, సీరియల్ కిల్లర్, సపోర్టింగ్ యాక్టర్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం గన్స్ అండ్ గులాబ్ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంటున్నాడు.

ఈ సందర్బంగా పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన యశ్, రిషబ్ శెట్టి లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనేక భాషల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న దుల్కర్, కన్నడలో యష్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, రిషబ్ శెట్టి తనకు పరిచయస్తుడని, కొన్ని విషయాల్లో యష్, రిషబ్ ఒకేలా ఉంటారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

దుల్కర్ నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో మాట్లాడిన దుల్కర్..’ మైసూర్‌లో ‘కురుప్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు యష్ తనకు, తన బృందానికి ఇంటి భోజనం పంపాడు.

యష్ చాలా కూల్ పర్సన్. చాలా మంచి మనసున్న వ్యక్తి ‘ అని చెప్పుకొచ్చాడు. ఇక రిషబ్ గురించి మాట్లాడుతూ.. ‘‘పరిమిత ప్రాంతం, అక్కడి ప్రజలు, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలపై రిషబ్ సినిమా తీసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు.

పాన్ ఇండియా సినిమా తీయాలని, అనవసర బడ్జెట్ పెట్టి, పెద్ద పెద్ద స్టార్లను తీసుకోకుండా, ఆ కథకే పరిమితమై సినిమా తీయాలని ముందే ప్లాన్ చేసి సినిమా తీయడం విశేషం. ఒక ప్రాంత ప్రజల ఆచరణను ప్రపంచానికి పరిచయం చేశాడు.

నార్త్ ఇండియన్స్‌కి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడంలో రిషబ్ చాలా అద్భుతంగా కృషి చేశారు’ యశ్, రిషబ్‌చాలా పెద్ద మనసున్న వ్యక్తులు. వారు అన్ని భాషల్లోనూ మాట్లాడుతుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరూ స్నేహానికి చాలా ప్రాధాన్యమిస్తారు’ అని దుల్కర్ తెలిపాడు.





























