- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun New Stylish Photos Goes Trending in Social Media Telugu Heroes Photos
Allu Arjun: వాట్ ఏ స్టైల్ బాస్.. ఇందుకేనేమో అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ అనేది.. ఫోటోస్.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈమూవీని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోండగా.. నేషనల్ క్రష్ రష్మిక, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్‌తో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
Updated on: Aug 18, 2023 | 12:31 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఈమూవీలో ఊర మాస్ లుక్ లో బన్నీ స్టైల్..డైలాగ్స్.. యాక్టింగ్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. 2021 డిసెంబర్‌లో విడుదలైన ‘పుష్ప’ సినిమా బన్నీ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించింది.

ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప తర్వాత ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పుష్ప 2 షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది.

ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న టైం లోనే.. ఈ తరుణంలో బన్నీ ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ప్రెజెంట్ ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.. ఎలాగో స్టైలిష్ స్టార్ అక్కడ., దానికి ఇంకొంచెం స్టైల్ యాడ్ అయితే ఇంక స్పెషల్ గా చెప్పేది ఏం ఉంటుంది. ఇంకా సూపర్ స్టైలీష్ గా కనిపిస్తున్నారు బన్ని.

పుష్ప సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇందులో సంయుక్త కథానాయికగా అని టాక్.
