Karimnagar: ఆగని గుండెపోటు మరణాలు.. తమ్ముడి చిన్న కర్మ రోజు అన్నకు హార్ట్‌ఎటాక్‌.. 12 రోజుల వ్యవధిలో అన్నాదమ్ములు మృతి

Karimnagar: తమ్ముడు మధుసూధన్ హఠణ్మారంతో ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ తమ్ముని చిన్నకర్మ రోజున గుండెపోటుకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో షాకుకు గురైన చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పది రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన శ్రీకాంత్ రెడ్డి కూడా కన్నుమూశాడు.

Karimnagar: ఆగని గుండెపోటు మరణాలు.. తమ్ముడి చిన్న కర్మ రోజు అన్నకు హార్ట్‌ఎటాక్‌.. 12 రోజుల వ్యవధిలో అన్నాదమ్ములు మృతి
Brother Died Of Heart Attac
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 18, 2023 | 12:09 PM

కరీంనగర్‌, ఆగస్టు 18: తమ్ముడి మరణంతో కుమిలిపోతూ ఆ అన్న చివరి తంతు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాడు. ఉన్నట్టుండి ఆయన కూడా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. అన్నాదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతిచెందారు. ఒకే ఇంట్లో 12రోజుల తేడాలో విషాదం అలుముకుంది. ఇద్దరు కొడుకుల మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి రోధనతో ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విషద సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉమ్మెంత చంద్రారెడ్డి చిన్న కుమారుడు మదుసూధన్ అలియాస్ మధుకర్ రెడ్డి(26) హైదరాబాద్ లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 3న మధుసూధన్ గుండెపోటుకు గురై ఆకస్మికంగా మృతి చెందడంతో చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అయితే చంద్రారెడ్డి పెద్ద కుమారుడు శ్రీకాంత్ రెడ్డి (30) కరీంనగర్ లో ప్రైవేటు జాబ్ చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. తమ్ముడు మధుసూధన్ హఠణ్మారంతో ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ తమ్ముని చిన్నకర్మ రోజున గుండెపోటుకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో షాకుకు గురైన చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పది రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన శ్రీకాంత్ రెడ్డి కూడా కన్నుమూశాడు. ఈ విషయం తెలిసిన చంద్రారెడ్డి కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. చెట్టంత కొడుకులిద్దరూ కళ్లముందే కానరాని లోకాలకు తరలి వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల మనో వేదనను తీర్చే వారు లేకుండా పోయారు.

పక్షం రోజుల వ్యవధిలోనే వారసులిద్దరిని కోల్పోయిన చంద్రారెడ్డి కుటంబ పరిస్థితి విన్న ప్రతి ఒక్కరూ కూడా షాక్ కు గురవుతున్నారు. విధి ఆడిన నాటకంలో తల్లిదండ్రులకు బాసటగా నిలవాల్సిన బిడ్డలు ప్రాణాలు కోల్పోయిన తీరు గురించి గ్రామస్థులు మాట్లాడుకుంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఇటీవల.. వయస్సు తో సంభందం లేకుండా గుండె పోట్లు వస్తున్నాయి.. పని వొత్తిడి కారణంగా.. ఇలాంటి.. మరణాలు సంభవిస్తున్నాయి..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..