Burger King: 27 ఏళ్లలో ఎన్నడూ సెలవు పెట్టని ఉద్యోగి.. అతని అంకిత‌భావానికి రూ. 3.5 కోట్ల ప్రతిఫలం దక్కింది..!

27 ఏళ్ల క్రితం..తన తండ్రి ఆ ఉద్యోగంలో చేరాడని చెప్పింది. ఒక సింగిల్ ఫాదర్‌గా తనకు, తన సోదరి సహా కుటుంబాన్ని పోషించలేక తన తండ్రి ఎంతో కష్టపడ్డాడని చెప్పింది. ఆ ఉద్యోగం లో చేరిన తర్వాతే.. తాము కడుపునిండా భోజనం చేశామని, ఆ తర్వాత తన తండ్రి మరో మహిళను పెళ్లిచేసుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం మరో ఇద్దరు చెల్లెళ్లతో కలసి.. మొత్తం నలుగురు పిల్లలను పోషిస్తున్నట్టుగా చెప్పింది. తన తండ్రి

Burger King: 27 ఏళ్లలో ఎన్నడూ సెలవు పెట్టని ఉద్యోగి.. అతని అంకిత‌భావానికి రూ. 3.5 కోట్ల ప్రతిఫలం దక్కింది..!
Burger King
Follow us

|

Updated on: Aug 18, 2023 | 11:38 AM

గత 27ఏళ్ల కాలంలో ఎన్నాడూ ఉద్యోగానికి లీవ్‌ పెట్టని ఓ వ్యక్తికి సరైన ప్రతిఫలం దక్కింది. ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ బ‌ర్గ‌ర్ కింగ్ ఉద్యోగి 27 ఏళ్ల పాటు ఒక్క‌రోజు కూడా ప‌నికి డుమ్మా కొట్టకుండా, లీవ్‌ పెట్టకుండా ఉన్నందుకు.. కంపెనీతో పాటు స‌హోద్యోగులు అతనికి సరైన సత్కారం ఇచ్చారు. గోఫండ్‌మీ అనే క్రౌడ్‌సోర్స్‌డ్ విరాళాల ద్వారా అతనికి 4,22,185 డాలర్లు అంటే అక్షరాల రూ. 3.50 కోట్లు బహుమతి అందింది. ఈ సంఘటన అమెరికాలోని లాస్‌వెగాస్‌లో చోటు చేసుకుంది. లాస్‌వెగాస్‌కు చెందిన బర్గర్‌కింగ్‌ చైన్‌ రెస్టారెంట్‌లో 54 ఏళ్ల కెవిన్‌ ఫోర్ట్.. 27సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పని చేసినట్లుగా కంపెనీ ప్రకటించింది. అందుకు ఆ రెస్టారెంట్ యాజమాన్యం .. అతని పనితనానికి మెచ్చి రివార్డులు ఇస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించిన వీడియోను కెవిన్ ఫోర్డ్.. తన సోషల్ మీడియా టిక్ టాక్ లో పోస్ట్ చేశాడు. కెవిన్ ఫోర్డ్ ఈ బహుమతులను స్వీకరించిన సంఘటన గత సంవత్సరం వైరల్ టిక్‌టాక్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.

వైరల్‌ వీడియోలో కెవిన్‌ ఫోర్డ్ తన యజమాని బహుకరించిన ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌ని చేతిలో పట్టుకుని కనిపించాడు. అదే తనకు కంపెనీ ఇచ్చిన గిప్ట్ బ్యాగ్‌ అని తెలిసింది. అయితే, ఆ సంచిలో ఉన్న గిఫ్ట్‌ ఐటమ్స్‌ చూసిన కెవిన్‌ కంగుతిన్నాడు.. అందులో సినిమా టికెట్లు, స్వీట్లు, పెన్నులు, కీచైన్‌లు, స్టార్‌బక్స్ కప్పులు.. ఇంకా ఏవో ఇతర వస్తువులు కనిపించాయి. ఇది చూసిన నెటిజన్లు.. ఇంత చవకైన బహుమతులు ఇస్తారా..? అతను అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు.. అతడు ఎంతో విలువైన బహుమతికి అర్హుడని సూచించారు. కెవిన్ కూతురు సెరీనా తండ్రి క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్క‌లేద‌ని వాపోతూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం చెప్పింది.

ఇవి కూడా చదవండి

27 ఏళ్ల క్రితం..తన తండ్రి ఆ ఉద్యోగంలో చేరాడని చెప్పింది. ఒక సింగిల్ ఫాదర్‌గా తనకు, తన సోదరి సహా కుటుంబాన్ని పోషించలేక తన తండ్రి ఎంతో కష్టపడ్డాడని చెప్పింది. ఆ ఉద్యోగం లో చేరిన తర్వాతే.. తాము కడుపునిండా భోజనం చేశామని, ఆ తర్వాత తన తండ్రి మరో మహిళను పెళ్లిచేసుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం మరో ఇద్దరు చెల్లెళ్లతో కలసి.. మొత్తం నలుగురు పిల్లలను పోషిస్తున్నట్టుగా చెప్పింది. తన తండ్రి పనిచేస్తున్న సదరు కంపెనీ బీమా ఇస్తుందని తెలియడంతోనే.. తన తండ్రి గత 27 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తున్నాడని తెలిపింది. త‌న తండ్రికి నిజంగా ద‌క్కాల్సిన గౌర‌వం, పేరుప్ర‌ఖ్యాతుల కోసం ఆమె గోఫండ్‌మి క్యాంపెయిన్ లాంఛ్ చేసింది. ఈ క్యాంపెయిన్‌కు అనూహ్య స్పంద‌న రావ‌డంతో ఏకంగా 4ల‌క్ష‌ల డాల‌ర్లు పైగా (రూ. 3.48 కోట్లు) విరాళాలు స‌మ‌కూరాయని చెప్పింది. ఆమె తన తండ్రికి నిజమైన గుర్తింపును అందించాలనే లక్ష్యంతో GoFundMe ప్రచారాన్ని ప్రారంభించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!