Viral News: తన తల్లిపై బాలుడు పోలీసులకు ఫిర్యాదు.. నన్ను అనాథాశ్రమంలో చేర్పించమని పోలీసులకు విన్నపం.. రీజన్ ఏమిటో తెలిస్తే నవ్వులే నవ్వులు..
ఓ బాలుడు తన తల్లిపై కోపంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. హోంవర్క్ చేయనందుకు కొడుకును తల్లిని మందలించింది. దీంతో ఆ బాలుడు ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులకు అతను చేసిన ఫిర్యాదుని చూసిన పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు. ఆశ్చర్యకరమైన ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చాంగ్‌కింగ్‌లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. అయితే ఆ బాలుడు చెప్పిన మాటలు విని పోలీస్ ఆఫీసర్ కూడా కంగారు పడ్డాడు.
కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పిల్లలు కూడా అప్డేట్ అయ్యారు. ఒకప్పుడు అల్లరి చేస్తే చిన్న పిల్లలని భయపెట్టడానికి పోలీసులకు ఇచ్చేస్తామని భయపెట్టేవారు. అయితే ఇప్పుడు చిన్నారులే ఏ మాత్రం భయం లేకుండా నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి.. తమ స్నేహితులపై లేదా తల్లిదండ్రుల మీద కంప్లైట్ చేస్తున్నారు. తాజాగా ఓ బాలుడు తన తల్లిపై కోపంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. హోంవర్క్ చేయనందుకు కొడుకును తల్లిని మందలించింది. దీంతో ఆ బాలుడు ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులకు అతను చేసిన ఫిర్యాదుని చూసిన పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు. ఆశ్చర్యకరమైన ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఓ బాలుడు చైనాలోని చాంగ్‌కింగ్‌లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. అయితే ఆ బాలుడు చెప్పిన మాటలు విని పోలీస్ ఆఫీసర్ కూడా కంగారు పడ్డాడు. ఇకపై తన ఇంట్లో నివసించడం ఇష్టం లేదని బాలుడు పోలీసులకు చెప్పాడు. ఎందుకు అని పోలీసులు ఆ బాలుడిని ప్రశ్నించగా.. నేను మా ఇంట్లో ఉండలేను.. తనను అనాథాశ్రమానికి పంపాలని కోరడం మొదలుపెట్టాడు.
అనాథాశ్రమానికి పంపమని కోరిన బాలుడు
బాలుడి వయస్సు కేవలం 10 సంవత్సరాలు. హోమ్‌వర్క్ చేయడం లేదని ఆ బాలుడి తల్లి మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు తల్లిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అంతేకాదు తనను ఇక ఇంటికి పంపవద్దని, అనాథాశ్రమంలో ఉంచమని పోలీసులను అభ్యర్థించడం ప్రారంభించాడు. దీంతో పోలీసులు కూడా ఒక్క క్షణం ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. తర్వాత ఎలాగోలా ఆ బాలుడిని మభ్యపెట్టి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకుని వారిని సంప్రదించారు. హోంవర్క్ చేయలేదని తాను తన కుమారుడిని తిట్టినట్లు పిల్లవాడి తల్లి కూడా చెప్పింది. అయితే చిన్నమాటకే తన కొడుకు అనాథాశ్రమానికి వెళ్లాలని పట్టుపెట్టాడని తెలియడంతో ఒక్కసారిగా తల్లి ఉలిక్కిపడింది.
బాలుడి ఫిర్యాదు ఏమిటంటే?
హోమ్‌వర్క్ చేయమంటూ తన తల్లి తనను ఎప్పుడూ తిడుతుందని పిల్లవాడు చెప్పాడు. అంతేకాదు ఆమె ఎప్పుడూ చదువుకోమని తనపై ఒత్తిడి తెస్తుంది.. కనుక నేను మా ఇంటికి వెళ్లడం ఇష్టం లేదని చెప్పాడు. అయితే పోలీసులు ఎలాగోలా చిన్నారిని ఒప్పించడంతో ఆ తర్వాత తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్‌లో చిన్నారి కూర్చున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..