తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌‌లకు హాల్ట్..

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే ఆ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇకపై మరో రెండు హల్టింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణీకుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌‌లకు హాల్ట్..
Telangana Trains
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 18, 2023 | 12:01 PM

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్ వచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ.. రాకపోకలను సాగించే యశ్వంత్‌పూర్- హజరత్ నిజాముద్దీన్ సంపర్క్‌క్రాంతి, చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణీకుల సౌకర్యార్ధం మహబూబ్‌నగర్, షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది సౌత్ సెంట్రల్ రైల్వే. హైదరాబాద్ డివిజన్ పరిధిలో మంగళవారం, గురువారం మినహా మిగిలిన రోజుల్లో యశ్వంత్‌పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే నెంబర్ 12649 కర్ణాటక సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 20 నుంచి మహాబూబ్‌నగర్‌కు ఉదయం 6.14/15 గంటలకు బయల్దేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 12650 కర్ణాటక సంపర్క్‌క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మహబూబ్‌నగర్‌కు ఆయా రోజుల్లో మధ్యాహ్నం 12.29/30 గంటలకు బయల్దేరుతుంది.

ఇక కాచిగూడ నుంచి చెంగల్పట్టు వెళ్లే నెంబర్ 17652 ఎగ్మోర్ డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు షాద్‌నగర్‌కు ప్రతి రోజు సాయంత్రం 05.44/45 బయల్దేరుతుండగా, తిరుగు ప్రయాణంలో చెంగల్పట్టు నుంచి కాచిగూడ వెళ్లే నెంబర్ 17651 ఎగ్మోర్ డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు షాద్‌నగర్‌లో 05.59/06.00 గంటలకు బయల్దేరుతుందని రైల్వే అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

12649: కర్ణాటక సంపర్క్‌క్రాంతి టైంటేబుల్ ఇలా..

ఈ రైలు యశ్వంత్‌పూర్‌లో ప్రతీ రోజూ(మంగళ, గురు మినహా) మధ్యాహ్నం 1.50 గంటలకు బయల్దేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గుంతకల్, కర్నూలు, కాచిగూడలతో ఇకపై మహబూబ్‌నగర్, షాద్‌నగర్‌ స్టేషన్లలోనూ ఆగనుంది. తిరుగు ప్రయాణంలో 12650 కర్ణాటక సంపర్క్‌క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ నుంచి బయల్దేరి.. ఏపీ, తెలంగాణలలో ఆయా స్టేషన్లలోనే ఆగుతుంది.

17652 ఎగ్మోర్ డైలీ ఎక్స్‌ప్రెస్ టైంటేబుల్ ఇలా..

ఈ రైలు ప్రతీ రోజూ కాచిగూడ నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతుంది. జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, దోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజాంపేట, కోడూరు, రేణిగుంట, పుత్తూరు మీదుగా చెంగల్పట్టు వెళ్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..