ఆడినవి 2 టెస్టులే.. కట్ చేస్తే.. 30 ఫోర్లు, 5 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. 7గురి బౌలర్ల ఊచకోత.!

England One Day Cup 2023, Bristol: డబుల్ సెంచరీలు అంత సాధ్యం కాదు.. సెహ్వాగ్, సచిన్, రోహిత్ శర్మ.. ఇలా టీమిండియా ప్లేయర్స్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేశారు.. ఈ కోవలోనే ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న డొమెస్టిక్ వన్డే-కప్ 2023లో పరుగుల వరద పారిస్తున్నాడు ఓ ప్లేయర్.

ఆడినవి 2 టెస్టులే.. కట్ చేస్తే.. 30 ఫోర్లు, 5 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. 7గురి బౌలర్ల ఊచకోత.!
England Cricketer
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 14, 2023 | 4:06 PM

ఈ 26 ఏళ్ల క్రికెటర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆడినవి కేవలం 2 టెస్టులే. అత్యధిక స్కోర్ వచ్చేసి 8 పరుగులు అంతే!. కానీ డొమెస్టిక్ క్రికెట్‌లో ఇతడొక అలుపెరగని బాటసారి. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు.. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న డొమెస్టిక్ వన్డే-కప్ 2023లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆగష్టు 13న సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆటగాడు ఏకంగా 30 ఫోర్లు, 5 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి.. ఏకంగా 7గురి బౌలర్లను పరుగులతో ఊచకోత కోశాడు. కట్ చేస్తే.! తన జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఇంతకీ అతడెవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు.. జేమ్స్ బ్రేసీ.

గ్లౌసెస్టర్‌షైర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న జేమ్స్ బ్రేసీ తన డొమెస్టిక్ వన్డే కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్ సాధించాడు. ఇందులో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న గ్లౌసెస్టర్‌షైర్ జట్టు తరపున.. కెప్టెన్ జేమ్స్ బ్రేసీ(244), క్రిస్ డెంట్(68) చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. 38 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఎదుర్కుని 65 పరుగులు చేశాడు డెంట్. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ఒలివర్ ప్రైస్(77) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే బ్రేసీ తన సెంచరీని పూర్తి చేసుకుని ప్రైస్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 213 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలగే తన డబుల్ సెంచరీని సైతం 141 బంతుల్లో పూర్తి చేశాడు.

చివరి వరకు క్రీజులో ఉన్న బ్రేసీ.. మొత్తంగా 151 బంతులు ఎదుర్కుని 30 ఫోర్లు, 5 సిక్సర్లతో 224 పరుగులు చేశాడు. ఆఖర్లో టేక్టర్(37), బురెన్(35) విజృంభించడంతో గ్లౌసెస్టర్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి.. 454 పరుగులు చేసింది. సోమర్‌సెట్ బౌలర్లలో లాంగ్‌రిడ్జ్, థామస్, బషీర్ తలో వికెట్ తీశారు. ఇక బ్రేసీ దెబ్బకు సోమర్‌సెట్ బౌలింగ్ విభాగంలో ఏడుగురు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించారు.

ఇక భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన సోమర్‌సెట్ నిర్ణీత ఓవర్లకు 256 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో గ్లౌసెస్టర్‌షైర్ 198 పరుగుల తేడాతో అద్భుత విజయం అందుకుంది. ఆ జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్లు రెండంకెల పరుగులు చేసినప్పటికీ.. ఒక్కరూ వాటిని మూడు అంకెలుగా మార్చలేకపోయారు. అండ్రూ ఉమీద్(55) జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గ్లౌసెస్టర్‌షైర్ బౌలర్లలో షా, మీకెరెన్ చెరో మూడు వికెట్లు.. ప్రైస్ రెండు వికెట్లు.. ప్రైస్, బూరెన్ తలో వికెట్ పడగొట్టారు.

198 పరుగుల తేడాతో అద్భుత విజయం..

మ్యాచ్ అనంతరం జేమ్స్ బ్రేసీ కామెంట్..

రికార్డుల్లోకి జేమ్స్ బ్రేసీ డబుల్ సెంచరీ..

కాగా, ఈ విజయంతో గ్లౌసెస్టర్‌షైర్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.