AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సీక్రెట్‌గా లవర్ కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు.. చివరికి బట్టల్లేకుండా..!

తాజాగా ఇలాగే ఓ యువకుడు తన లవర్‌ను సీక్రెట్‌గా కలవడానికి ఆమె ఇంటికి వెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు. సీన్ కట్ చేస్తే.. అనూహ్యంగా ఆ యువతి తల్లిదండ్రులు ఇంటికి రావడంతో.. ఆ యువకుడు చివరికి ఒంటి మీద బట్టల్లేకుండా.. బాల్కనీ నుంచి.. ఏముంది.! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే వీడియోలో చూసెయ్యండి.!

Viral Video: సీక్రెట్‌గా లవర్ కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు.. చివరికి బట్టల్లేకుండా..!
Viral Video
Ravi Kiran
|

Updated on: Aug 14, 2023 | 4:06 PM

Share

‘జీవితం చాలా చిన్నది.. ప్రతీ నిమిషాన్ని ఎంజాయ్ చేయాలి’ అన్నది సామెత.. అలాగే మన జీవితంలో దొరికే ప్రతీ సంతోషానికి కచ్చితంగా ఏదొక మూల్యం చెల్లించాల్సిందేనని అంటుంటారు పెద్దలు. తాజాగా ఇలాగే ఓ యువకుడు తన లవర్‌ను సీక్రెట్‌గా కలవడానికి ఆమె ఇంటికి వెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు. సీన్ కట్ చేస్తే.. అనూహ్యంగా ఆ యువతి తల్లిదండ్రులు ఇంటికి రావడంతో.. ఆ యువకుడు చివరికి ఒంటి మీద బట్టల్లేకుండా.. బాల్కనీ నుంచి.. ఏముంది.! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే వీడియోలో చూసెయ్యండి.! కచ్చితంగా పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. దానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువకుడు బట్టల్లేకుండా ఓ బాల్కనీ నుంచి పొడవాటి వస్త్రం పట్టుకుని కిందకు దిగుతుండటం మీరు చూడవచ్చు. పై నుంచి ఒక అమ్మాయి.. అతడి బట్టలను కిందకు విసిరేసింది. అతడిని పట్టుకునేందుకు ఆ అమ్మాయి తండ్రి ప్రయత్నించగా.. ఎలాగోలా ఆ యువకుడు తప్పించుకున్నాడు. ఇక కింద అంతస్తులో ఓ మహిళ.. ఆ యువకుడ్ని చీపురు పట్టుకుని కొడుతుంటుంది. ఈ ఘటన అంతటిని స్థానికులు రికార్డు చేయగా.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను ‘Enezator’ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనికి ఇప్పటివరకు 4.7 మిలియన్ల వ్యూస్ వచ్చింది. అలాగే 42 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. కాగా, నెటిజన్లు దీనిపై వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ప్రేయసి కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడని’ కొందరు కామెంట్ చేయగా.. ‘సీక్రెట్‌గా ఇలాంటి పనులు చేస్తే.. మూల్యం చెల్లించక తప్పదు’ అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరైతే ఫేక్ వీడియో అని కొట్టిపారేశారు. మరి మీ సంగతేంటి.? వీడియోపై ఓ లుక్కేయండి.

ఆ వీడియోపై నెటిజన్ల కామెంట్స్ ఇలా..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!