AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌ చేసిన ఏఎస్పీ.. వీడియో వైరల్‌ కావటంతో వేటు పడింది..

హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు పోలీసులు, ప్రజాప్రతినిధులు వచ్చారు. హఠాత్తుగా అక్కడికి చేరుకున్న ఏఎస్పీ ఓ చేత్తో ఫోన్ చెవిలో పెట్టుకుని మరో చేత్తో ముఖ్యమంత్రికి సెల్యూట్‌ చేశారు. శేఖర్ సుయాల్ బదిలీ తర్వాత, జై బలుని కొత్వార్ కొత్త అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు.

ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌ చేసిన ఏఎస్పీ.. వీడియో వైరల్‌ కావటంతో వేటు పడింది..
Uttarakhand Cm
Jyothi Gadda
|

Updated on: Aug 18, 2023 | 1:47 PM

Share

మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసిన ఏఎస్పీపై బదిలీ వేటు పడింది. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శేఖర్ సుయాల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి సెల్యూట్ చేశారు. కోట్‌ద్వార్‌లోని విపత్తు ప్రాంతాలను సందర్శించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ దిగిన తర్వాత ఏఎస్పీ ఫోన్‌లో మాట్లాడుతూ ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి విధుల్లో ఉన్న ఏఎస్పీ దురుసుగా ప్రవర్తించడంతో, ఏఎస్పీని నరేంద్ర నగర్‌లోని పోలీసు శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు. ఆగస్టు 11న హరిద్వార్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కోట్‌ద్వార్‌లోని గ్రాస్తాన్‌గంజ్ హెలిప్యాడ్‌లో దిగారు. హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు పోలీసులు, ప్రజాప్రతినిధులు వచ్చారు. హఠాత్తుగా అక్కడికి చేరుకున్న ఏఎస్పీ ఓ చేత్తో ఫోన్ చెవిలో పెట్టుకుని మరో చేత్తో ముఖ్యమంత్రికి సెల్యూట్‌ చేశారు. శేఖర్ సుయాల్ బదిలీ తర్వాత, జై బలుని కొత్వార్ కొత్త అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు.

హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. అనేక మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. హిమాచల్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 74కు పెరిగిందని అధికారులు చెప్పారు. భారీ వర్షాల కారణంగా కొత్వార్‌లో బురద, నీటితో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి.నదులు పొంగిపొర్లడంతో రెండు పెద్ద వంతెనలు, ఒక చిన్న వంతెన సహా మూడు వంతెనలు కూలిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే