AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad : అయ్యో పాపం.. కాబోయే అమ్మ..! రెండో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి..

జుగ్నక కవితకు రాత్రి 8 గంటల సమయంలో నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి సరైన దారి, వాహన సదుపాయం, లేకపోవడంతో పాటు 4 కి. మీ వెళితేనే ఆటో సౌకర్యం ఉంటుంది. తప్పని పరిస్థితిలో ఎడ్లబండిపైనే తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలోనే 2 కి. మీ వెళ్లాక నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే అంటే అడవిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం..

Hyderabad : అయ్యో పాపం.. కాబోయే అమ్మ..! రెండో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి..
Pregnant Woman Died
Peddaprolu Jyothi
| Edited By: Jyothi Gadda|

Updated on: Aug 18, 2023 | 1:30 PM

Share

మరి కొద్ది నెలలు గడిస్తే చాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డతో అమ్మ అని పిలిపిచుకోవాలి అనుకుంది..అంతలోనే తీవ్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. రెండో అంతస్థుపై నుంచి కిందపడి ప్రమాదవశాత్తు గర్భిణి మృతి చెందిన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. లింగంపల్లి గ్రామంలోని వెంకట్‌రెడ్డి కాలనీకి చెందిన వెంకట్‌రెడ్డి అన్న కూతురు శ్రీనిఖకు గతేడాది డిసెంబర్‌లో వివాహమైంది. ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భిణి. కాగా రెండు రోజుల క్రితం కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో చెకప్‌ కోసం తన బాబాయ్‌ ఇంటికి వచ్చింది. వీరు మూడంతస్తుల భవనంలోని రెండవ అంతస్తులో ఉంటున్నారు.

గురువారం ఉదయం 7.10 గంటలకు శ్రీనిఖ నిద్రలేచి బాల్కనిలోకి వచ్చి వాకింగ్‌ చేసింది. కొద్దిసేపటికి కళ్లు తిరుగుతున్నాయని చెప్పగా ఆమె పిన్ని ఇంట్లోకి వెళ్లమని సూచించి కిందకు దిగింది. ఇంతలోనే శ్రీనిఖ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే మదీనాగూడలోని శ్రీకర ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని చందానగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్తాప్తు చేస్తున్నారు.

5 నెలల గర్భవతి గా ఉన్న శ్రీనిఖను చూసి ఆ కుటుంబం ఎంతో సంతోషంతో మునిగిపోయారు…రోజులు గడుస్తున్నా కొద్దీ కడుపు లో ఉన్న బిడ్డ కోసం ఎదురు చూశారు… ఆ బిడ్డ అల్లరి ని చూడాలి అని అనుకున్న ఆ కుటుంబం లో తల్లి తో సహా బిడ్డను పోగొట్టుకోవడం తో విషాదం లో మునిగిపోయారు.. శ్రీనిఖ తో పాటు బిడ్డ కూడా చనిపోవడం తో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. కడుపు లో ఉన్న బిడ్డను చూడకుండానే అటు తల్లి కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడంతో రోదనలు మిన్నంటాయి..

ఇవి కూడా చదవండి

ఏజెన్సీల్లో గర్భిణీ కష్టాలు

ఇదిలా ఉంటే..అంబులెన్స్‌లు కూడా అందుబాటులో లేక కొన్ని ప్రాంతాల్లో గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక కడుపులోని బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మారుమూల గ్రామాల్లో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇలాంటి పరిస్థితిలోనే ఓ తల్లీ బిడ్డలు అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు. జిల్లాలోని బజార్ హత్నుర్ మండలం గిరిజాయ్ పంచాయతీ పరిధిలోని ఉమర్ద గ్రామానికి చెందిన జుగ్నక కవితకు రాత్రి 8 గంటల సమయంలో నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి సరైన దారి, వాహన సదుపాయం, లేకపోవడంతో పాటు 4 కి. మీ వెళితేనే ఆటో సౌకర్యం ఉంటుంది. తప్పని పరిస్థితిలో ఎడ్లబండిపైనే తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలోనే 2 కి. మీ వెళ్లాక నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే అంటే అడవిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఎడ్లబండిపై గిరిజాయ్ గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో 12 కి. మీ దూరం ప్రయాణించి రాత్రి 12 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. అదృష్ట వశాత్తు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..