Rainfall Alert: తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు.. ఆయా జిల్లాలకు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌..

శుక్రవారం సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షం కురిసిందని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో 4.8 మిమీ, అల్వాల్‌లో

Rainfall Alert: తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు.. ఆయా జిల్లాలకు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌..
Rain
Follow us

|

Updated on: Aug 19, 2023 | 7:50 AM

గత వారం పది రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు మళ్లీ విజృంభించాడు. దాదాపు రెండు వారాల విరామం తర్వాత తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈశాన్య బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం కొనసాగిన అల్పపీడన ద్రోణి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలకు విస్తరించిందని తాజా వాతావరణ విశ్లేషణ సూచిస్తుంది.

తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని సూచించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒరిస్సా తీరాల మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్‌, జనగాం, భువనగిరి, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నారాయణపేట్‌, గద్వాల్‌ జిల్లాల్లో గ్రీన్‌ అలర్ట్‌ ప్రకటించారు వాతావరణ అధికారులు.

ఇవి కూడా చదవండి

ఇక రేపు కూడా పలు జిల్లాలో ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, కొత్తగూడెం,సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

శుక్రవారం సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షం కురిసిందని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో 4.8 మిమీ, అల్వాల్‌లో 4.3 మిమీ, త్రిముల్‌ఘేరిలో 4 మిమీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చేల్పూర్‌లో 7.95, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6, భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 5.76 సెం.మీ. వర్షం పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6, ఏటూరునాగారంలో 5.1, వెంకటాపురంలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వీటితోపాటు మంచిర్యాల, కుమురంభీమ్‌-ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్‌తోపాటు శివార్లలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
ఏమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా.? విశాల్‌పై హైకోర్ట్ ఆగ్ర‌హం
ఏమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా.? విశాల్‌పై హైకోర్ట్ ఆగ్ర‌హం
వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ విసిగిస్తున్నారా..?
వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ విసిగిస్తున్నారా..?
బాలిక చేయి పట్టుకొని 'ఐ లవ్ యూ' చెప్పాడనీ.. రెండేళ్ల జైలు శిక్ష!
బాలిక చేయి పట్టుకొని 'ఐ లవ్ యూ' చెప్పాడనీ.. రెండేళ్ల జైలు శిక్ష!
అంజీర్ నీరు చర్మానికి వరం..! ఉదయాన్నే ఖాళీకడుపుతో తీసుకుంటే..
అంజీర్ నీరు చర్మానికి వరం..! ఉదయాన్నే ఖాళీకడుపుతో తీసుకుంటే..
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
ఇంట్లో రామ చిలుకలను పెంచుకుంటే ఏం జరుగుతుందంటే..
ఇంట్లో రామ చిలుకలను పెంచుకుంటే ఏం జరుగుతుందంటే..
ముందుగా వధువు అత్తతో శృంగారం.. ఆ తర్వాతే పెళ్లి
ముందుగా వధువు అత్తతో శృంగారం.. ఆ తర్వాతే పెళ్లి
నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!