TSRTC: మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి ఈ రూట్లో కూడా స్పెషల్ బస్సు

హైదరాబాద్‌లోని మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణికులను తమవైపు ఆకర్షించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు, సేవలను తీసుకొస్తుంది. ప్రయాణికులు ఎక్కువగా ఉండే చోట్ల వారి సౌకర్యాల కోసం మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐటీ కారిడార్‌లో ప్రయాణించేటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా లేడీస్ బస్సలు సేవలను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజగా ఇప్పుడు మహిళలకోసం మరో కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది.

TSRTC: మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి ఈ రూట్లో కూడా స్పెషల్ బస్సు
Tsrtc
Follow us
Aravind B

|

Updated on: Aug 19, 2023 | 5:15 AM

హైదరాబాద్‌ న్యూస్, ఆగస్టు 19: హైదరాబాద్‌లోని మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఇప్పటికే ఆర్టీసీ ప్రయాణికులను తమవైపు ఆకర్షించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు, సేవలను తీసుకొస్తుంది. ప్రయాణికులు ఎక్కువగా ఉండే చోట్ల వారి సౌకర్యాల కోసం మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐటీ కారిడార్‌లో ప్రయాణించేటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా లేడీస్ బస్సలు సేవలను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజగా ఇప్పుడు మహిళలకోసం మరో కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇప్పుడు ఐటీ కారిడార్ మాత్రమే కాకుండా మరో మార్గంలో కూడా లేడీస్ స్పేషల్ బస్సులను నడిపాలని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. అయితే ఈసారి కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును నడిపేందుకు సిద్ధమైంది. 127 కే అనే నంబర్‌తో నడిచే ఈ లేడిస్ స్పెషల్ బస్సు సేవలను.. ఈ నెల 21న ప్రారంభించనున్నారు.

ప్రతిరోజూ ఉదయం పూట 8.50 గంటలకు కోఠి నుంచి ఈ లేడిస్ స్పెషల్ బస్సు బయలుదేరుతుంది. ఆ తర్వాత లక్డీకాపుల్, మాసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్‌ రోడ్‌ మీదుగా బస్సు కొండాపూర్‌ చేరుకుంటుంది. తిరిగి మళ్లీ సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరుతుంది. మళ్లీ అదే మార్గంలో మహిళా ప్రయాణికులను కొండాపూర్ నుంచి కోఠికి చేరుస్తుంది. అయితే మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. అలాగే క్షేమంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరింది. అయితే ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా జులై 31న హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్నటువంటి మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం.. ప్రత్యేకంగా మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ బస్సు సేవలను ఆర్టీసీ ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ప్రత్యేక బస్సు.. జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ మార్గంలో ప్రయాణిస్తుంది. అలాగే ఉదయం, సాయంత్రం పూట ప్రత్యేక సమయాల్లో సేవలు అందిస్తోంది. ఆ సమయంలోనే మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం త్వరలోనే ఇంకా కొన్ని లేడీస్ ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయనుందని ఎండీ సజ్జనార్ అన్నారు. అన్నట్లుగానే ఇప్పుడు కోఠీ- కొండాపూర్ మార్గంలో ఇంకో బస్సును ప్రారంభించనున్నారు. అయితే ఇలా ప్రత్యేక బస్సులు ప్రారంభించడంపై మహిళా ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..