Made in India iPhone: ఐ ఫోన్ లవర్స్‌కి సూపర్ గుడ్‌న్యూస్.. ఇప్పుడు మన దేశంలోనే ఐఫోన్ ఉత్పత్తి..! భారీగా తగ్గనున్న ధరలు..
ఐ ఫోన్ లవర్స్‌కి గొప్ప శుభవార్త ఇది.. ఎందుకంటే.. మీరు ఐఫోన్ 15 కోసం ఎక్కువ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ దీనిని భారతదేశంలోనే తయారు చేస్తోంది. ఆపిల్ భారతదేశంలో తన 2 అధికారిక స్టోర్‌లను కూడా ప్రారంభించింది.అంతేకాదు.. ఈ ఫీచర్ కేవలం iPhone 15 Pro, 15 Pro Max మోడళ్లకు మాత్రమే ఉంటుంది.
iPhone 15: ఆపిల్ తన ఐఫోన్ 15 సిరీస్‌ను వచ్చే నెలలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. అయితే దీనికి ముందు ఒక బిగ్‌న్యూస్ బయటకు వచ్చింది. ఈ వార్త తెలిసిన ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందే. తమిళనాడులోని ఒక ప్లాంట్‌లో ఐఫోన్ 15 ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ భారీ బాధ్యతను ఫాక్స్‌కాన్‌కు అప్పగించారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇదే పెద్ద మలుపు కానుంది. దీంతో ఐఫోన్‌లు భారత్‌లోనే తయారవడమే కాకుండా ధర కూడా తగ్గనుంది. ఇది వినియోగదారులకు గొప్ప శుభవార్త.
ప్లాన్ ఏంటంటే..
మేక్ ఇన్ ఇండియా’ చొరవ కింద ‘ఐఫోన్ 15’ని తయారు చేసిన తర్వాత కంపెనీ ఇప్పుడు దానిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ‘ఐఫోన్ 15’ని స్వల్పకాలంలో ఇతర దేశాలకు సరఫరా చేయడం ప్రారంభించడమే కంపెనీ ప్రధాన లక్ష్యం. భారతదేశంలోని ఇతర ఆపిల్ సరఫరాదారులు పెగాట్రాన్, విస్ట్రాన్ (టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్నవి) కూడా ‘ఐఫోన్ 15’ను అసెంబ్లింగ్ చేసే ప్రక్రియను త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా గతేడాది సెప్టెంబర్‌లో యాపిల్ భారత్‌లో ‘ఐఫోన్ 14’ని అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది.
టిమ్ కుక్ ఏం చెప్పారు?..
2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల సందర్భంగా.. భారత్‌లోని తమ కొత్త స్టోర్‌ల పనితీరు మా అంచనాలను మించిపోయిందని కుక్ అన్నారు. జూన్ త్రైమాసికంలో భారత్‌లో రెవెన్యూ రికార్డు సృష్టించామని ఆయన తెలియజేసారు.
ఐఫోన్ 15 సిరీస్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?
మ్యూట్ స్విచ్ బటన్ అందుబాటులో లేదు:
కొత్త ఐఫోన్ మోడల్‌లో మ్యూట్ స్విచ్ బటన్ ఉండదు. నివేదికల ప్రకారం, ఐఫోన్‌లోని మ్యూట్ స్విచ్ ఈసారి అనుకూలీకరణ బటన్‌తో అటాచ్ చేశారు. వినియోగదారులు తమ సౌలభ్యం ప్రకారం ఈ బటన్‌ను ఉపయోగించవచ్చు. ప్రత్యేక పనుల కోసం కూడా ఈ బటన్‌ను కేటాయించవచ్చు. దీంతో ఐఫోన్ ఆపరేటింగ్ అనుభవం మరింత మెరుగ్గా మారనుంది.
లైట్నింగ్ పోర్ట్‌కి బదులుగా USB-C పోర్ట్..
iPhone 15 సిరీస్ లో USB-C పోర్ట్‌తో లైట్నింగ్ పోర్ట్ కలిగి ఉంది.. దీంతో, ఫోన్ వేగంగా ఛార్జ్ చేయడమే కాకుండా, ఐఫోన్ బ్యాటరీ కూడా ఎక్కువ మన్నికతో ఉంటుంది. సమాచారం ప్రకారం, ఐఫోన్ 15 సిరీస్ ఆల్వేస్ ఆన్ ప్రమోషన్ ఫీచర్ కలిగి ఉంది. ఈ ఫీచర్ కేవలం iPhone 15 Pro, 15 Pro Max మోడళ్లకు మాత్రమే ఉంటుంది. ఈసారి ఐఫోన్ 15 ప్రో డార్క్ బ్లూ రంగులో విడుదల కానుంది. ఇది గ్రే టోన్‌లో కూడా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..