Telugu News India News Tribals' art, culture, manners, dresses have their own uniqueness, Says Union Minister Dharmendra Pradhan
Dharmendra Pradhan: ఆ విషయంలో మోడీ ప్రభుత్వం మరింత ముందుంటోంది.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Jatiya Janjati Mahotsav: దేశంలో గిరిజన నాయకత్వానికి మరింత ప్రాతినిధ్యం కల్పించడంలో మోడీ ప్రభుత్వం ముందుంటోందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఒడిశా గిరిజన సమాజానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా నియమితులై ప్రపంచ ఖ్యాతిని పొందారంటూ ప్రధాన్ చెప్పారు.
Jatiya Janjati Mahotsav: దేశంలో గిరిజన నాయకత్వానికి మరింత ప్రాతినిధ్యం కల్పించడంలో మోడీ ప్రభుత్వం ముందుంటోందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఒడిశా గిరిజన సమాజానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా నియమితులై ప్రపంచ ఖ్యాతిని పొందారంటూ ప్రధాన్ చెప్పారు. ఆదివాసి ప్రజలు సాదాసీదా, స్పష్టమైన హృదయం కలిగి ఉంటారనని.. ఒడిశా గర్వించదగిన కుమార్తె ఇప్పుడు భారత రాష్ట్రపతిగా సేవలందిస్తున్నారంటూ కొనియాడారు. ఒడిశా అంగోల్ జిల్లాలోని నల్కో నగరంలో శుక్రవారం జరిగిన జాతీయ గిరిజన ఉత్సవంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవంలో పాల్గొనండం సంతోషంగా ఉందన్నారు. గిరిజన సమాజం మన నాగరికతకు చిహ్నమని తెలిపారు. ఈ సమాజానికి కళ, సంస్కృతి, సంస్కరణ, సంప్రదాయం, ఉద్యమం, నృత్యం, సంగీతం, ఆహారం, వస్త్రధారణ వంటి ప్రత్యేకతలు, సొంత గుర్తింపులు ఉన్నాయంటూ కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు.
62 వర్గాల గిరిజనులు, 21 విభిన్న భాషలు, 74 మాండలికాలు మాట్లాడే ఏకైక రాష్ట్రం ఒడిశా అని ప్రధాన్ చెప్పారు. ఒడిశాలో ఏడు గిరిజన భాషలు వాడుకలో ఉన్నాయని ఆయన చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మోదీ ప్రభుత్వం ఏకలవ్య విద్యాలయాలను నెలకొల్పిందన్నారు. ఇప్పుడు, బిర్సా ముండా జన్మదినాన్ని జంజాటి గౌరవ్ దిబాస్‌గా జరుపుకుంటున్నామంటూ ప్రధాన్ చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని.. కొత్త పార్లమెంట్ భవనంలో గిరిజన సంస్కృతి ప్రతిబింబిస్తుందంటూ ప్రధాన్ వివరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశ సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులు, కళాకారుల కోసం విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దీనితో గిరిజన సమాజానికి మేలు జరుగుతుందన్నారు. గిరిజన సమాజంలోని పురాతన భాషల కోసం వర్ణమాల ఆధారిత భాషా పుస్తకాలను ప్రారంభించడం ద్వారా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లయిందన్నారు.