BRICS Summit: త్వరలో భేటీకానున్న ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. వేదిక కానున్న దక్షిణాఫ్రికా..

సౌదీ అరేబియా, యూఏఈ వంటి సన్నిహిత మిత్ర దేశాలు బ్రిక్స్‌లో చేరాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటన చాలా కీలకమైంది. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సులో అంతర్జాతీయ వ్యవహారాలు, పాశ్చాత్త దేశాల ఆధిపత్యం, భౌగోళిక రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలనే అంశాలపై చర్చించనున్నారు. అయితే, భారత్‌-చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న టైమ్‌లో మోదీ-జిన్‌పింగ్‌ భేటీ ఆసక్తి రేపుతోంది.

BRICS Summit: త్వరలో భేటీకానున్న ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. వేదిక కానున్న దక్షిణాఫ్రికా..
Brics Summit In Johannesbur
Follow us
Surya Kala

|

Updated on: Aug 19, 2023 | 8:05 AM

ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మరోసారి భేటీకాబోతున్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న బ్రిక్స్ సదస్సు ఇందుకు వేదిక కానుంది.    జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగే ఈ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరు అవుతారంటూ అధికారికంగా ప్రకటించింది చైనా విదేశాంగశాఖ.  భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు చివరిసారిగా గతేడాది ఇండోనేషియా బాలిలో జరిగిన జీ20 సదస్సులో మాట్లాడుకున్నారు. అంతకుముందు ఉజ్బెకిస్తాన్‌లో ఒకే వేదికను పంచుకున్నా కనీసం పలకరించుకోలేదు మోదీ-జిన్‌పింగ్‌. దాంతో, ఇరువురి భేటీపై ఆసక్తి నెలకొంది.

సౌదీ అరేబియా, యూఏఈ వంటి సన్నిహిత మిత్ర దేశాలు బ్రిక్స్‌లో చేరాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటన చాలా కీలకమైంది. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సులో అంతర్జాతీయ వ్యవహారాలు, పాశ్చాత్త దేశాల ఆధిపత్యం, భౌగోళిక రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలనే అంశాలపై చర్చించనున్నారు. అయితే, భారత్‌-చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న టైమ్‌లో మోదీ-జిన్‌పింగ్‌ భేటీ ఆసక్తి రేపుతోంది. మరోవైపు   బ్రిక్స్‌లో చేరేందుకు దాదాపు 25 దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి. వాస్తవానికి బ్రిక్స్ ఐదు దేశాల సంస్థ.. దీనిని మరింతగా విస్తరించాలా వద్దా అనే దానిపై జోహన్నెస్‌బర్గ్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..