Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రవాణా శాఖలో సరికొత్త మార్పుకు నాంది.. ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లే..

Andhra Pradesh: ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. అయితే, ఇప్పుడు తాజాగా, రవాణా శాఖ అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, డిజిటల్‌ ఆర్‌సీ కార్డులు జారీ విధానం మరింత సులభతరం కాబోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 1500కు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రవాణా శాఖలో సరికొత్త మార్పుకు నాంది.. ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లే..
Digital Services
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 19, 2023 | 10:12 AM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లనే జారీ చేయాలని ఏపీ రవాణా శాఖ నిర్ణయంతీసుకుంది .. ఏపీ ఆర్‌టీఏ సిటిజన్ ఆండ్రాయిడ్ యాప్‌తోనూ సర్టిఫికేట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాహనాల తనిఖీల సమయంలో యాప్‌లోని డిజిటల్ సర్టిఫికేట్లను ప్రభుత్వ అధికారులకు చూపిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన్ పరివార్‌తో అనేక రాష్ట్రాలు ప్లాస్టిక్ కార్డుల స్థానంలో డిజిటల్ సర్టిఫికేట్లను జారీ చేయడం ప్రారంభించాయి.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ లను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని ఏపీ రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్థి పలికినట్టు తెలిపింది.. ఇప్పటికే కార్డులకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రం త్వరలో అవి పోస్ట్‌లో వారివారి ఇళ్లకు పంపిస్తామని వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్కో కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్ కింద మరో రూ.25 తీసుకుని కార్డులను ప్రజల ఇళ్లకు పోస్టులో పంపించేది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన్ పరివార్‌తో అనేక రాష్ట్రాలు ప్లాస్టిక్ కార్డుల స్థానంలో డిజిటల్ సర్టిఫికేట్లను జారీ చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఏపీ కూడా డిజిటల్ బాట పట్టింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రజలు రవాణా శాఖ వెబ్‌వెబ్ సైట్ లేదా ఏపీ ఆర్‌టీఏ సిటిజన్, ఈప్రగతి, ఓఆర్జీలో ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకుని ధ్రువపత్రాలను తీసుకోవాలి. ఏపీ ఆర్‌టీఏ సిటిజన్ ఆండ్రాయిడ్ యాప్‌తోనూ సర్టిఫికేట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాహనాల తనిఖీల సమయంలో యాప్‌లోని డిజిటల్ సర్టిఫికేట్లను ప్రభుత్వ అధికారులకు చూపిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని అనుమతించాలని సంబంధిత అధికారులకూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. అయితే, ఇప్పుడు తాజాగా, రవాణా శాఖ అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, డిజిటల్‌ ఆర్‌సీ కార్డులు జారీ విధానం మరింత సులభతరం కాబోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 1500కు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు సుమారు 45 వేలకు పైగా కార్డులను అందించాల్సి వస్తోంది. ఆర్‌సీ కార్డులైతే నెలకు 3 లక్షలకు పైగా జారీ చేయాల్సి వస్తోంది. డిజిటల్‌ విధానం అందుబాటులోకి రావడంతో అతి తక్కువ సమయంలోనే వారికి డిజిటల్‌ కార్డులు అందుబాటులోకి వచ్చే సౌలభ్యం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!