Mother’s Love: ఆవుని గుద్దిన లారీ.. తల్లివద్ద తల్లడిల్లిన దూడ.. సుమోటాగా కేసు నమోదు చేసి కేసుని చేధించిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో హృదయాలను కలచి వేసే సంఘటన జరిగింది. ఆకివీడు గుమ్ములూరు సెంటర్లో ఒక ఆవును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆవు అక్కడికక్కడే చనిపోయింది. అదే సమయంలో ఆవు దూడ అక్కడే ఉంది. తల్లి ఆవు రక్తపు మడుగులో చనిపోయి ఉంటే దూడ కన్నీటితో నిలిచుండిపోయింది. ఆవు దూడ దగ్గరకు మరో ఆవు చేరి ఓదార్చేందుకు ప్రయత్నించింది. మూగజీవాల వేదన వర్ణనాతీతంగా మారింది.

Mother's Love: ఆవుని గుద్దిన లారీ.. తల్లివద్ద తల్లడిల్లిన దూడ.. సుమోటాగా కేసు నమోదు చేసి కేసుని చేధించిన పోలీసులు
Child And Mothers Love
Follow us
B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Aug 19, 2023 | 10:51 AM

ఏలూరు ఆగష్టు 19వ తేదీ: గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మ్రృతి చెందిన ఘటనలు రాత్రి సమయంలో జరిగితే.. ఆ వ్యక్తి మరణానికి కారణమేంటో కూడా బాహ్య ప్రపంచానికి తెలియదు. నడి రోడ్డుపై ఒక ఆవును అర్థరాత్రి సమయంలో ఢీ కొట్టిన వాహనాన్ని నెల రోజుల పాటు అష్ట కష్టాలు పడి పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు లో సంచలనం గా మారిన ఈ ఆవు మరణం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో హృదయాలను కలచి వేసే సంఘటన జరిగింది. ఆకివీడు గుమ్ములూరు సెంటర్లో ఒక ఆవును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆవు అక్కడికక్కడే చనిపోయింది. అదే సమయంలో ఆవు దూడ అక్కడే ఉంది. తల్లి ఆవు రక్తపు మడుగులో చనిపోయి ఉంటే దూడ కన్నీటితో నిలిచుండిపోయింది. ఆవు దూడ దగ్గరకు మరో ఆవు చేరి ఓదార్చేందుకు ప్రయత్నించింది. మూగజీవాల వేదన వర్ణనాతీతంగా మారింది. హృదయ విధారకమైన ఈ సంఘటన స్థానికులను కలిచి వేసింది. రోడ్డుపై వెళ్తున్న వారు కూడా ఆవు, దూడను చూసి చలించిపోయారు. ఈ ఘటన గత జులై 18న జరిగింది.

ఈ ఉదంతాన్ని భీమవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ వారు సుమోటోగా కేసు నమోదు చేయాలని, బాధ్యులను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. జడ్జి ఆదేశాలతో సుమోటోగా కేసు నమోదు చేశారు ఆకివీడు పోలీసులు. ఐపిసి 429, యానిమల్ ప్రొటక్షన్ యాక్ట్ సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఒక పాల లారీ నిర్లక్ష్యంగా నడుపుతూ ఆవుని గుద్దినట్టు గుర్తించారు. గురువారం ( ఆగస్టు 17 ) అర్ధరాత్రి ప్రమాదానికి కారణమైన లారీని ఆకివీడులో అదుపు లోనికి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఇప్పుడు లేడని.. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను గుర్తించి నోటీసులు ఇస్తామని ఎస్సై సత్య సాయి అంటున్నారు.

ఇవి కూడా చదవండి

కొంతమంది ఆవులను, ఆంబోతులను విచ్చలవిడిగా రోడ్డుపైకి వదిలేస్తున్నారు. మూగజీవాలను కావాలనే రోడ్డుపైన వదిలేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆవులను మేపుకునేవాళ్లు బాధ్యత లేకుండా రోడ్లపై వదిలేసి పాలు ఇచ్చే టైం కి ఇంటికి వచ్చేటట్టు చూసుకుంటున్నారు. మరి కొంత మంది ఇతర ప్రాంతాల నుండి ఆవులను తక్కువ రేటుకు కొనుక్కుని వచ్చి రోడ్లపై వదిలేస్తున్నారు. అవి దొరికినది తిని కొంచెం ఎదిగి, బరువు ఎక్కిన తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. స్వార్థపరుల అత్యాశతో మూగజీవాలు ప్రమాదాల బారిన పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది. వీటిని కాపాడేందుకు ఆవులను రోడ్డు మీద వదిలేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..